ఏషియన్ గేమ్స్ 2023: గోల్డ్ నెం.16! ఆర్చరీలో స్వర్ణం ... 71 మెడల్స్‌తో భారత్ సరికొత్త రికార్డు...
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కి 16వ స్వర్ణం... 71 పతకాలతో 2018 ఏషియన్ గేమ్స్ రికార్డును బ్రేక్ చేసిన భారత్...
ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత్‌కి పతకాల పంట పడుతోంది. తాజాగా ఆర్చరీలో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఫైనల్ చేరిన భారత ఆర్చరీ అథ్లెట్లు జ్యోతిసురేఖా వెన్నం- ఓజాస్ డియోటెల్, స్వర్ణం సాధించారు. సౌత్ కొరియాతో జరిగిన ఫైనల్‌లో 159-158 పాయింట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది భారత్. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కి ఇది 16వ స్వర్ణం...
కజకిస్తాన్ జోడితో జరిగిన సెమీస్‌లో 159-154 తేడాతో గెలిచి, ఫైనల్ చేరిన జ్యోతి వెన్నం- ఓజాస్ డియోటెల్... ఫైనల్‌లోనూ గెలిచి ఏషియన్ గేమ్స్ చరిత్రలో ఆర్చరీకి రెండో స్వర్ణం అందించారు.
ఈ పతకంతో ఏషియన్ గేమ్స్‌లో భారత పతకాల సంఖ్య 71కి చేరింది. ఇంతకుముందు 2018 ఏషియన్ గేమ్స్‌లో భారత్ 70 పతకాలు గెలవడమే ఆసియా క్రీడల్లో భారత్‌కి అత్యుత్తమ ప్రదర్శన.
రెజ్లింగ్‌లో పురుషుల గ్రీసో రోమన్ 87 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సునీల్ కుమార్ సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లాడు. 35 కి.మీ.ల రేస్ వాక్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత అత్లెట్లు మంజు రాణి, రామ్ బాబూ కాంస్య పతకం సాధించారు.