20 ఏళ్ల కుర్రాడి బౌలింగ్‌కి, టాపార్డర్ విలవిల... ఎవరీ దునిత్ వెల్లలాగే? ఫుట్‌బాల్ ప్లేయర్ అవ్వాలని ఆశపడి...

ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4  మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన దునిల్ వెల్లలాగే..  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్‌లను పెవిలియన్ చేర్చిన లంక  యంగ్ స్పిన్నర్...

Asia Cup 2023: Who is Dunith Wellalage, 20 Years old spinner who picked Virat Kohli, Rohit Sharma, KL Rahul CRA

స్పిన్ బౌలింగ్‌ ఎదుర్కోవడానికి భారత బ్యాటర్లు పెద్దగా ఇబ్బంది పడరు. అయితే టీమిండియా బ్యాటర్లను కూడా ఇబ్బంది పెట్టగల స్పిన్నర్లలో తయారుచేయడంలో శ్రీలంక ముందుంటుంది. ముత్తయ్య మురళీధరన్ తర్వాత అజంతా మెండీస్, భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు...

తాజాగా ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో ఇండియా - శ్రీలంక మ్యాచ్‌లో లంక యంగ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే, భారత టాపార్డర్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. 25 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన దునిత్ వెల్లలాగే... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను కూడా పెవిలియన్ చేర్చాడు..

విరాట్ కోహ్లీ 12 బంతుల్లో 3 పరుగులు చేసి షాట్‌కి ప్రయత్నించి దసున్ శనకకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే, 53 పరుగులు చేసిన రోహిత్ శర్మ, దునిత్ వెల్లలాగే స్పిన్ మ్యాజిక్‌కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

44 బంతుల్లో 2 ఫోర్లతో 39 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ కూడా దునిత్ వెల్లలాగే బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొదటి 3 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు దునిత్ వెల్లలాగే..  హార్ధిక్ పాండ్యా కూడా దునిత్ చిక్కులోనే పడ్డాడు. మొత్తం 10 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 40 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు దునిత్ వెల్లలాగే.. 

ఇంతకీ ఎవరీ దునిత్ వెల్లలాగే... 

2003 జనవరి 9న కొలంబోలో జన్మించిన దునిత్ వెల్లలాగే, 2022లో పాకిస్తాన్‌పై టెస్టు ఆరంగ్రేటం చేశాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ ద్వారా వన్డే ఆరంగ్రేటం చేశాడు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 22 మ్యాచులు ఆడిన 71 వికెట్లు తీసిన దునిత్ వెల్లలాగే, 20 లిస్టు ఏ మ్యాచులు ఆడి 27 వికెట్లు తీశాడు..

ఇప్పటిదాకా 8 వన్డేలు మాత్రమే ఆడిన దునిత్ వెల్లలాగే, 9 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 26 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు దునిత్ వెల్లలాగే. 

అండర్19 వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్, ఆస్ట్రేలియాపై 5 వికెట్లు తీసిన దునిత్ వెల్లలాగే, U19 వరల్డ్ కప్ 2022 టోర్నీలో శ్రీలంక తరుపున 17 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 113 పరుగులు చేసిన దునిత్ వెల్లలాగే, ఆసీస్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదాడు..

ఈ పర్ఫామెన్స్‌తో 2023 వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో దునిత్ వెల్లలాగేకి స్టాండ్ బై ప్లేయర్‌గా చోటు కల్పించింది శ్రీలంక క్రికెట్ బోర్డు. వానిందు హసరంగ గాయంతో ఆసియా కప్‌కి దూరం కావడంతో ఈ కుర్రాడికి తుది జట్టులో చోటు దక్కింది..

ఫుట్‌బాల్ ఆటను ఎంతో ఇష్టపడే దునిత్ వెల్లలాగే, రియల్ మాడ్రిడ్ క్లబ్ తరుపున ఆడాలని కలలు కన్నాడు. అయితే లంకలో ఫుట్‌బాల్‌కి పెద్దగా క్రేజ్ లేకపోవడం, అవకాశాలు దక్కకపోవడంతో స్పిన్నర్‌గా మారి... సూపర్ సక్సెస్ అయ్యాడు..  తాను క్రికెట్ పాఠాలు నేర్చుకున్న కొలంబోలో భారత టాపార్డర్‌ని కకావికలం చేశాడు దునిత్ వెల్లలాగే.  ఇప్పటిదాకా దునిత్ వెల్లలాగే తీసిన నాలుగు వికెట్లు కూడా స్టార్ ప్లేయర్లవే. మరి ఈ దునిత్ వెల్లలాగే, లంకకు మ్యాచ్ విన్నర్ అవుతాడో లేక అజింతా మెండీస్‌లా కొన్నాళ్లకే తెరమరుగు అవుతాడో చూడాలి.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios