Asia Cup 2023: టాస్ గెలిచిన టీమిండియా.. జోరు మీదున్న లంకకు షాక్ ఇవ్వగలదా?

India vs Sri Lanka: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో అక్షర్ పటేల్‌కి అవకాశం.. 

Asia Cup 2023: India won the toss and elected to bat first, Sri Lanka consecutive victories CRA

ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు టీమిండియా, శ్రీలంకతో మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా ఆదివారం పూర్తి కావాల్సిన మ్యాచ్ సోమవారం పూర్తి అయ్యింది. దీంతో భారత జట్టు వరుసగా మూడు రోజుల పాటు మ్యాచ్ ఆడనుంది. సూపర్ 4 రౌండ్‌లో ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌కి మాత్రమే రిజర్వు డే కేటాయించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్..

దీంత నేటి మ్యాచ్‌తో మిగిలిన రెండు మ్యాచులు వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దు అయితే టేబుల్ టాప్‌లో ఉన్న ఇండియా, శ్రీలంక జట్లు ఫైనల్ చేరతాయి. పాకిస్తాన్ ఫైనల్ చేరాలంటే సెప్టెంబర్ 14న శ్రీలంకతో జరిగే మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంటుంది...

వెన్ను నొప్పితో పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి అందుబాటులో లేని శ్రేయాస్ అయ్యర్, నేటి మ్యాచ్‌లో కూడా ఆడడం లేదు. పాకిస్తాన్‌తో సూపర్ 4 మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలు చేస్తే... విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ అజేయ హాఫ్ సెంచరీలతో దుమ్ము లేపారు..

శ్రేయాస్ అయ్యర్ కోలుకోకపోవడంతో నేటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఆడిన జట్టునే, నేటి మ్యాచ్‌లోనూ కొనసాగిస్తోంది భారత జట్టు. విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చి, నేటి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ లేదా అక్షర్ పటేల్‌ని ఆడించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే వరల్డ్ కప్ టోర్నీ ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం విరాట్ కోహ్లీని కొనసాగించాలని డిసైడ్ అయ్యింది మేనేజ్‌మెంట్..  శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చాడు.

 మరోవైపు శ్రీలంక జట్టు వరుసగా 13 వన్డేల్లో గెలిచి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. గత 13 వన్డే మ్యాచుల్లోనూ శ్రీలంక ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయడం విశేషం. దీంతో ఈ రికార్డును టీమిండియా బ్రేక్ చేయగలదా? అనేది ఆసక్తికరంగా మారింది. 

మరోవైపు వన్డే ఆసియా కప్‌ ఇప్పటిదాకా రోహిత్ శర్మ కెప్టెన్సీలో అన్ని మ్యాచుల్లోనూ టీమిండియా విజయం అందుకుంది. 2018లో వరుసగా 5 మ్యాచులు గెలిచిన రోహిత్ శర్మ అండ్ టీమ్, 2023 ఆసియా కప్‌లో వరుసగా నేపాల్, పాకిస్తాన్‌లపై గెలిచింది. గ్రూప్ స్టేజీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ఫలితం తేలకుండా రద్దు అయ్యింది. కాబట్టి ఓటమి లేని రోహిత్ శర్మ టీమ్, వరుస విజయాలతో జోరు మీదున్న శ్రీలంక జట్టుకీ మధ్య హోరా హోరీ పోటీ ఉంటుందని ఆశిస్తున్నారు అభిమానులు..
 

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

 శ్రీలంక జట్టు: పథుమ్ నిశ్శంక, దిముత్ కరుణరత్నే, కుసాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ, దసున్ శనక, దునిత్ విల్లలాగే, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, మథీశ పథిరాణా

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios