Asianet News TeluguAsianet News Telugu

ఉస్మాన్ ఖవాజా మరో సెంచరీ... జాక్ లీచ్‌ హ్యాట్రిక్ ముందు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆసీస్...

England vs Australia: రెండో ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన ఉస్మాన్ ఖవాజా... జాక్ లీచ్ హ్యాట్రిక్ బంతికి ముందు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా... 

Ashes Series 2021-22: Usman Khawaja another Century, Pat Cummins declares before Jack Leach
Author
India, First Published Jan 8, 2022, 12:11 PM IST

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు కూడా ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 416 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా, ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 

జానీ బెయిర్ స్టో 158 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 113 పరుగులు చేయగా బెన్ స్టోక్స్ 91 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 66 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ కూడా డకౌట్ అయ్యాడు. మార్క్ వుడ్ 41 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేయగా జాక్ లీచ్ 10, స్టువర్ట్ బ్రాడ్ 15 పరుగులు చేశారు...

ఆస్ట్రేలియా బౌలర్ బోలాండ్ 36 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కి రెండు వికెట్లు దక్కాయి. మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ తలా ఓ వికెట్ తీయగా నాథన్ లియాన్ రెండు వికెట్లు తీశాడు....

రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది ఆస్ట్రేలియా. మార్కస్ హారీస్ 27, డేవిడ్ వార్నర్ 3, మార్నస్ లబుషేన్ 29, స్టీవ్ స్మిత్ 23 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. 

86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్ కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి 179 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఉస్మాన్ ఖవాజా, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ మార్కును అందుకున్నాడు...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో స్టీవ్ స్మిత్, రోహిత్ శర్మ తర్వాత రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఉస్మాన్ ఖవాజా. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు ఖావాజా...

ఇంతకుముందు 1947లొ ఇంగ్లాండ్ ప్లేయర్ డెనిస్ కాంప్టన్, 1997లో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఇంతకుముందు ఈ ఫీట్ సాధించారు. 122 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 74 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీలను వెంటవెంటనే అవుట్ చేశాడు జాక్ లీచ్.. రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్ చేరువలో ఉన్న సమయంలో ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం విశేషం...

జాక్ లీచ్ 4 వికెట్లు తీయగా, మార్క్ వుడ్‌కి రెండు వికెట్లు దక్కాయి. 138 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు ఉస్మాన్ ఖవాజా. నాలుగో ఇన్నింగ్స్‌లో 388 పరుగుల భారీ టార్గెట్‌ని పెట్టింది ఆస్ట్రేలియా...

క్రీడా స్ఫూర్తి గురించి క్లాసులు పీకే ఆస్ట్రేలియా, ఇలా జాక్ లీచ్‌కి హ్యాట్రిక్‌ దక్కకూడదని ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. న్యూజిలాాండ్ ప్లేయర్ అజాజ్ పటేల్‌ 10 వికెట్ల ఫీట్‌ సమయంలో టీమిండియా ఇలా వ్యవహరించలేదని, క్రీడాస్ఫూర్తి అంటే ఏంటో వాళ్లని చూసి నేర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios