Ashes 2023: ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్  మరో సెంచరీ బాదేశాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆసీస్ బౌలింగ్ దళాన్ని సమర్థవంతంగా ఎదుర్కుని  కెరీర్ లో 30వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

వన్స్ ఐ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్స్ అంటున్నాడు ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్. గడిచిన రెండేండ్లలో క్రీజులోకి దిగితే పూనకం వచ్చినట్టుగా ఆడుతున్న రూట్.. ఏదైనా తాను దిగనంతవరకే.. దిగితే దబిడి దిబిడే అన్న రేంజ్ లో సాగుతోంది అతడి విధ్వంసం. తాజాగా యాషెస్ సిరీస్ లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో కూడా రూట్ సెంచరీతో కదం తొక్కాడు. టెస్టులలో రూట్‌కు ఇది 30వ సెంచరీ కావడం విశేషం. ఈ డబ్ల్యూటీసీ సైకిల్ (2023 - 25) లో తొలి సెంచరీ రూట్ దే..

గడిచిన రెండేండ్లుగా సెంచరీల మోత మోగిస్తున్న రూట్.. ఆధునిక క్రికెట్ లో ఫ్యాబ్ -4 గా పిలుచుకునే (విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్) బ్యాటర్లలో మిగిలిన ముగ్గురి కంటే దూకుడుగా ఆడుతున్నాడు. 

2012లో ఇండియాలోనే జరిగిన టెస్టు సిరీస్ లో ఎంట్రీ ఇచ్చిన రూట్.. ఆరంభంలో అంత గొప్పగా ఆడింది లేదు. ఎంట్రీ ఇచ్చిన మూడేండ్ల తర్వాత టెస్టులలో సెంచరీ (ఆస్ట్రేలియా) చేశాడు. 2021 వరకూ రూట్.. 96 టెస్టులు ఆడితే చేసింది 17 సెంచరీలే. కానీ 2021 తర్వాత అతడు తన ‘రూట్’ మార్చాడు. 

Scroll to load tweet…

2021 నుంచి రూట్ 2.0 ను చూస్తున్నారు అభిమానులు. 2021 నుంచి 34 టెస్టులు ఆడిన రూట్.. 62 ఇన్నింగ్స్ లలో 58.91 సగటుతో 3,299 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడు 13 సెంచరీలు, 9 అర్థ సెంచరీలు చేయడం గమనార్హం. అంతకుముందు 96 టెస్టులలో 17 సెంచరీలే చేస్తే రెండేండ్లలోనే 34 టెస్టులలో 13 శతకాలు చేశాడు. ఈ రెండేండ్ల కాలంలో టెస్టు క్రికెట్ లో మరే ఆటగాడు కూడా 2000 పరుగులు, ఏడు సెంచరీల కంటే ఎక్కువ చేయలేదు.

ఫ్యాబ్ - 4 లో అతడే తోపు..

ఫ్యాబ్ - 4 ఆటగాళ్లలో రూట్ ఒక్కడే గడిచిన మూడేండ్లలో అత్యద్భుత ఫామ్ లో ఉన్నాడు. కోహ్లీ, స్మిత్, విలియమ్సన్ లు ఫామ్ కోల్పోయి సెంచరీలు కాదు కదా క్రీజులో నిల్చోవడానికే నానా తంటాలు పడ్డారు. కానీ రూట్ మాత్రం శతకాల వరద పారిస్తున్నాడు. ఈ మూడేండ్ల కాలంలో విరాట్ ఒక్క సెంచరీ మాత్రమే చేయగా రూట్ ఏకంగా 17 సెంచరీలు బాదడం విశేషం. ఫ్యాబ్ -4 ఆటగాళ్లలో సెంచరీల జాబితాను ఇక్కడ చూద్దాం. 

స్టీవ్ స్మిత్ - 31 
జో రూట్ - 30 
విరాట్ కోహ్లీ - 28 
కేన్ విలియమ్సన్ - 28 


Scroll to load tweet…