ముంబై: పాకిస్తాన్ తో ఇండియా ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు కృషి చేయాలని యువరాజ్ సింగ్ చేసిన ప్రకటనకు మాజీ ఫాస్ట్ బౌలర్ చేతన్ చౌహాన్ కౌంటర్ ఇచ్చాడు. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్ లు జరగకూడదని ఆయన అన్నాడు.

ఇరు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా ద్వైపాక్షిక సిరీస్ జరగకూడదని, పాకిస్తాన్ లో క్రికెట్ ఆడడం మంచిది కాదని చేతన్ చౌహాన్ అన్నాడు. ఉగ్రవాదులు క్రికెట్ ను కూడా వదలిపెట్టరని, పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఉన్నంత కాలం ఇరు దేశాల మధ్య క్రికెట్ జరగకూడదని ఆయన అన్నాడు. 

Also Read: కేఎల్ రాహుల్ 12వ స్థానంలో వచ్చినా....: శిఖర్ ధావన్ కామెంట్

న్యూజిలాండ్ పై జరిగిన వన్డే సిరీస్ ను భారత్ కోల్పోవడంపై కూడా చేతన్ చౌహాన్ స్పందించాడు. ఈ సిరీస్ లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ గాయాలతో దూరం కావడం వల్ల  నిలకడగా రాణిస్తున్న అజింక్య రహానేను వన్డే సిరీస్ కు తీసుకోవాల్సిందని ఆయన అన్నాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఆయన కొన్ని సూచనలు చేశాడు.

బుమ్రా అలసిపోయినట్లు కనిపిస్తున్నాడని ఆయన అన్నాడు. టెస్టు సిరీస్ లో ఇండియా రాణిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపాడు. అజింక్యా రహానే జట్టులోకి వస్తున్నప్పటికీ శిఖర్ ధావన్, రోహిత్ శర్మ మిస్సవుతున్నారని ఆయన అన్నాడు. 

Also Read: టీమిండియా చాలా స్ట్రాంగ్, ఈ విజయం అద్భుతం.. ఆనందంలో విలియమ్సన్

యువ క్రికెటర్ రిషబ్ పంత్ నిలకడగా రాణించాల్సిన అవసరం ఉందని చేతన్ అన్నాడు. అవకాశాలువస్తున్నందున వాటిని పంత్ సద్వినియోగం చేసుకవాలని ఆయన అన్నాడు. అప్పుడే జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోగలడని అన్నాడు.