భువనేశ్వర్ కుమార్‌ను అర్జున్ ఔట్ చేయడంతో సన్‌రైజర్స్ ఆలౌటైంది. చేజారిపోతుంది అనుకున్న మ్యాచ్ లో ఔట్ చేసి... జుట్టును అర్జున్ టెండుల్కర్ గెలిపించడంతో... అందరూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ తనయుడు, ముంబయి ఇండియన్స్ ఆటగాడు అర్జున్ టెండుల్కర్ అదరగొట్టాడు. మంగళవారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో.. అర్జున్ తన సత్తా చాటాడు. తొలిసారి ఐపీఎల్ లో తన టాలెంట్ చూపించే అవకాశం దక్కింది. 19వ ఓవర్‌లో గ్రీన్ 4 పరుగులే ఇవ్వడంతో సన్‌రైజర్స్ విజయానికి చివరి ఓవర్‌లో 20 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి అర్జున్ కి అవకాశం ఇచ్చారు. కాగా.... అర్జున్ టెండూల్కర్ వేసిన ఆఖరి ఓవర్‌లో సమద్ క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు. దీంతో ముంబై విజయం లాంఛనమైంది. భువనేశ్వర్ కుమార్‌ను అర్జున్ ఔట్ చేయడంతో సన్‌రైజర్స్ ఆలౌటైంది. చేజారిపోతుంది అనుకున్న మ్యాచ్ లో ఔట్ చేసి... జుట్టును అర్జున్ టెండుల్కర్ గెలిపించడంతో... అందరూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా... మ్యాచ్ కి ముందు తన తండ్రి సచిన్ తనకు కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చారని అర్జున్ చెప్పడం విశేషం.
"సహజంగానే నా మొదటి IPL వికెట్‌ను పొందడం చాలా గొప్ప విషయమని అర్జున్ టెండుల్కర్ చెప్పాడు.తనకు బౌలింగ్ అంటే చాలా ఇష్టమని... కెప్టెన్ అడిగినప్పుడల్లా బౌలింగ్ చేయడం తనకు చాలా ఆనందంగా ఉంటుందని చెప్పాడు. జట్టు ప్రణాళికకు కట్టుబడి, తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తానని చెప్పాడు. తాను, తన తండ్రి తరచూ క్రికెట్ గురించి మాట్లాడుకుంటామని చెప్పాడు. ఆటకు ముందు తాము వ్యూహాలను చర్చిస్తామని చెప్పాడు. తన తండ్రి చెప్పినట్లు ప్రతి గ్రేమ్ ని ప్రాక్టీస్ చేస్తానని అర్జున్ తెలిపాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన హారీ బ్రూక్, 7 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన బెహ్రాన్‌డార్ఫ్ బౌలింగ్‌లో సూర్యకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి బెహ్రాన్‌డార్ఫ్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.
25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్, మయాంక్ అగర్వాల్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. 17 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్, కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో హృతిక్ షోకీన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
అభిషేక్ వర్మ 2 బంతుల్లో 1 పరుగు చేసి పియూష్ చావ్లా బౌలింగ్‌లో టిమ్ డేవిక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
13 ఓవర్లు ముగిసే సమయానికి 106 పరుగులే చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. చివరి 7 ఓవర్లలో 86 పరుగులు కావాల్సి రావడంతో మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఖాయమనుకున్నారంతా. అయితే పియూష్ చావ్లా వేసిన ఆఖరి ఓవర్‌లో 4, 6, 6, 4 బాదిన హెన్రీచ్ క్లాసిన్ మ్యాచ్‌లో ఊపు తీసుకొచ్చాడు..
అయితే 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసిన క్లాసిన్, అదే ఓవర్‌లో ఆఖరి బంతికి టిమ్ డేవిడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 55 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
మొదటి 13 బంతుల్లో 14 పరుగులే చేసిన మయాంక్ అగర్వాల్, 41 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 48 పరుగులు చేసి రిలే మెడరిత్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
6 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన మార్కో జాన్సెన్ కూడా మెడరిత్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. జాన్సెన్ అవుట్ అయ్యే సమయానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 20 బంతుల్లో 44 పరుగులు కావాలి..
6 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్, 18వ ఓవర్ ఐదో బంతికి రనౌట్ అయ్యాడు. దీంతో ఆరెంజ్ ఆర్మీ విజయానికి ఆఖరి 2 ఓవర్లలో 24 పరుగులు కావాల్సి వచ్చాయి. 19వ ఓవర్ వేసిన కామెరూన్ గ్రీన్ 4 పరుగులే ఇచ్చాడు..
అర్జున్ టెండూల్కర్ వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతికి పరుగులేమీ రాలేదు. రెండో బంతికి అనవసర పరుగు కోసం ప్రయత్నించి అబ్దుల్ సమద్ అవుట్ అయ్యాడు. భువీని అవుట్ చేసిన అర్జున్ టెండూల్కర్, ఐపీఎల్‌లో మొట్టమొదటి వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
