హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా వున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌పై అపెక్స్ కౌన్సిల్ వేటు వేసింది. ఈ మేరకు ఆయనకు షోకాజ్ నోటీసులు పంపారు. 

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా వున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌పై అపెక్స్ కౌన్సిల్ వేటు వేసింది. ఈ మేరకు ఆయనకు షోకాజ్ నోటీసులు పంపారు. అజార్‌పై వున్న కేసులు పెండింగ్‌లో వున్నందున హెస్‌సీఏ సభ్యత్వం సైతం రద్దు చేసింది అపెక్స్ కౌన్సిల్. అలాగే ప్రెసిడెంట్ హోదాలో రూల్స్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే వేటు వేశామని అపెక్స్ కౌన్సిల్ తెలిపింది.