టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ దంపతులు నేడు మూడో పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ.. అనుష్కని ఉద్దేశిస్తూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. కాగా..ఆ పోస్టు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

‘ మూడు ఏళ్లుగా.. ఇంకా జీవితాంతం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. కోహ్లీ, అనుష్క పెళ్లికి ముందు ఓ  యాడ్ షూట్ సందర్భంగా కలిశారు. మనసులు కలవడంతో కొన్నేళ్లు ప్రేమాయణం సాగించారు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించడంతో 2017 డిసెంబర్ 11న ఇటలీలో అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

విరుష్క దంపతులు ఇటీవల మరో శుభవార్త చెప్పారు. జనవరిలో తల్లిదండ్రులం కాబోతున్నట్లు వెల్లడించారు.  ఇదిలా ఉండగా.. కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అనుష్క మరోవైపు  భారత్ లో ఉన్నారు. దీంతో మూడో వార్షికోత్సవం రోజు వారిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు. కాగా.. తొలి టెస్టు తర్వాత కోహ్లీ తిరిగి స్వదేశానికి రానున్నాడు.