Asianet News TeluguAsianet News Telugu

‘నువ్వే మా చిన్నారి దేవతవి...’ కూతురు వామిక ఫోటోను షేర్ చేసిన అనుష్క శర్మ...

కూతురి ఫోటోను పోస్టు చేసి నవమి శుభాకాంక్షలు తెలిపిన అనుష్క శర్మ... వామిక కోహ్లీ పోటోకి గంటలోనే 15 లక్షల లైకులు...

Anushka sharma shares adorable pic of Vamika and wishes navami, posts goes viral in no time
Author
India, First Published Oct 13, 2021, 8:58 PM IST

భారత సారథి విరాట్ కోహ్లీలో ఇప్పుడు చాలా మార్పు కనిపించింది. అగ్రెసివ్ కెప్టెన్‌గా ఇంతకుముందు ఫీల్డ్‌లో వీరావేశంతో ఊగిపోయే విరాట్, ఇప్పుడు కాస్త ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. అంతేకాకుండా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ మార్పులకు కారణం ఆయన కూతురు వామిక...

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలకు ఇప్పుడు కూతురు వామిక కోహ్లీయే ప్రపంచం. ఖాళీ సమయం దొరికినప్పుడు కూతురితో గడపడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు అనుష్క, కోహ్లీ...తాజాగా మహానవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, కూతురి ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది అనుష్క శర్మ. 

‘నువ్వు రోజురోజుకీ నన్ను మరింత ధైర్యవంతురాలిగా, సాహసవంతురాలిగా మారుస్తున్నాం. నీలో ఉన్న దేవత నుంచి ఈ బలమంతా పొందుతున్నావేమో... మా చిన్నారి దేవతవి నువ్వే తల్లి... మై లిటిల్ వామికా... హ్యాపీ అష్టమి...’ అంటూ కూతురిని ముద్దాడుతున్న ఫోటోను పోస్టు చేసింది అనుష్క శర్మ...

కూతురిని సోషల్ మీడియాకి దూరంగా ఉంచి, పెంచాలని నిర్ణయం తీసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ... తాము పోస్టు చేసే ఫోటోలలో కూడా తన ఫోటోను కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు... అనుష్క తాజాగా పోస్టు చేసిన ఫోటో కూడా అలాగే ఉంది... ఈ ఫోటోకి గంట వ్యవధిలోనే 15 లక్షల లైక్స్, వేలల్లో కామెంట్లు రావడం విశేషం...

Follow Us:
Download App:
  • android
  • ios