టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ దివా అనుష్క శర్మ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.  పెళ్లి అయిన రోజు నుంచి పిల్లల గురించి గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే ప్రశ్న చాలా సార్లు అనుష్కకి కూడా ఎదురై ఉండొచ్చు.  

కాగా.. ఇటీవల ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తండ్రైన సంగతి తెలిసిందే. ప్రపోజ్ చేసిన కొద్దిరోజులకే.. తల్లిదండ్రులం కాబోతున్నామంటూ హార్దిక్ ప్రకటించాడు. ఇటీవల పండంటి మగ బిడ్డ కూడా పుట్టాడు. దీంతో.. ఇలాంటి న్యూస్ కోహ్లీ, అనుష్కల నుంచి ఎప్పుడు వింటామో అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. కాగా.. తాజాగా ఈ విషయంపై అనుష్క స్పందించారు. 

తాజాగా.. ఓ అభిమాని అనుష్కను ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో పిల్లల గురించి ఓ ప్రశ్న అడిగాడు. “మీ చుట్టూ ఉన్నవాళ్లు మిమ్మల్ని పిల్లల గురించే ప్ర‌శ్నిస్తున్నారా?” అన్న నెటిజన్ ప్రశ్నకు​, “లేదు, కేవలం సామాజిక మాధ్యమాల్లో మాత్రమే దీని గురించి చ‌ర్చించుకుంటున్నారు “ అని అనుష్క బ‌దులిచ్చింది.

“కోహ్లీ నుంచి ఎలాంటి హెల్ఫ్ తీసుకుంటూ ఉంటారు” అని మరో నెటిజన్​ ప్ర‌శ్నించగా,  “టైట్ గా ఉన్న బాటిల్​ మూతలు తీయడానికి, బరువైన కుర్చీలు ఎత్తేందుకు” అని పేర్కొంది అనుష్క. కాగా అసోం, బిహార్​ రాష్ట్రాల్లో వరదల వ‌ల్ల‌ నష్టపోయిన ప్రజలకు బాస‌ట‌గా ఉంటామ‌ని కోహ్లీ- అనుష్క ఇటీవలే హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.