గత రెండు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ఆండీ ఫ్లవర్... సంజయ్ భంగర్ ప్లేస్‌లో ఆర్‌సీబీ కొత్త హెడ్ కోచ్‌గా బాధ్యతలు..
ఐపీఎల్ 2024 సీజన్‌కి ముందు హెడ్ కోచ్‌ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్‌సీబీ. 2021 నుంచి ఆర్‌సీబీ హెడ్ కోచ్‌గా ఉన్న సంజయ్ భంగర్, క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న మైక్ హుస్సేన్‌లను ఆ బాధ్యతల నుంచి తప్పించింది టీమ్ మేనేజ్‌మెంట్..
2024 ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్ వ్యవహరించబోతున్నాడు. 2022లో లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు ఆండీ ఫ్లవర్. గత రెండు సీజన్లలో ఆండీ ఫ్లవర్ కోచింగ్‌లో లక్నో జట్లు, ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది..
జింబాబ్వే మాజీ బ్యాటర్ ఆండీ ఫ్లవర్, రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి టీమ్స్‌కి కోచ్‌గా వ్యవహరించాడు. హెడ్ కోచ్‌గా పాక్ సూపర్ లీగ్, ది హాండ్రెడ్, ఇంటర్నేషనల్ లీగ్ టీ20, టీ10 లీగుల్లో టైటిల్స్ గెలిచాడు ఆండీ ఫ్లవర్..
అంతేకాదు గత రెండేళ్లుగా ఆండీ ఫ్లవర్, హెడ్ కోచ్‌గా సూపర్ సక్సెస్ సాధించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆండీ ఫ్లవర్ కోచింగ్‌లో సెయింట్ లూసియా జోక్స్ వరుసగా రెండు సీజన్లలో ఫైనల్ చేరింది. అలాగే ఆండీ ఫ్లవర్ కోచింగ్‌లో గల్ఫ్ జెయింట్స్ జట్టు, ఐఎల్‌టీ20 2023 టైటిల్ గెలిచింది.
అలాగే ఆండీ ఫ్లవర్ కోచింగ్‌లో ట్రెంట్ రాకెట్స్, ది హాండ్రెడ్ 2023 సీజన్ టైటిల్‌ని గెలవగా పాక్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ టీమ్ వరుసగా రెండు సీజన్లలో ఫైనల్ చేరింది...
‘ఆర్‌సీబీ లాంటి టీమ్‌లో చేరడం చాలా గర్వంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న టీమ్‌లో సభ్యుడిగా చేరడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. చిన్న స్వామి స్టేడియంలో ఆర్‌సీబీ ఫ్యాన్స్ క్రేజ్‌ని, టీమ్ సభ్యుడిగా అనుభూతి చెందేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు ఆండీ ఫ్లవర్..
ఐపీఎల్ 2020, ఐపీఎల్ 2021 సీజన్లలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ప్లేఆఫ్స్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఎలిమినేటర్ మ్యాచుల్లో ఓడింది. 2022 సీజన్‌లో ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీలో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన ఆర్‌సీబీ, మరో అడుగు ముందుకు వేసి రెండో క్వాలిఫైయర్‌లో ఓడింది..
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్ వరకూ ప్లేఆఫ్స్ ఛాన్సులు సజీవంగా నిలుపుకున్న ఆర్‌సీబీ, చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఓడింది. 14 మ్యాచుల్లో 7 విజయాలు అందుకున్న ఆర్‌సీబీ, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది..
ఆర్‌సీబీ మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్, ఆండీ ఫ్లవర్ కోచింగ్ సిబ్బందిలో సభ్యుడిగా చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
