ఐపీఎల్ మెగా లీగ్ ప్రారంభానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈసారి కప్పు గెలవాలనే 8 మంది కసితో ప్రాక్టీసులో పాల్గొంటున్నాయి. రెండుసార్లు టైటిల్ గెలిచిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ కూడా ముచ్ఛటగా మూడో టైటిల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఐపీఎల్‌లో ఎంత మంది ఆల్‌రౌండర్లు ఉన్నా కోల్‌కత్తా టార్జాన్ ఆండ్రూ రస్సెల్‌యే బెస్ట్ అంటున్నాడు నైట్ రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్. ‘ఆండ్రూ రస్సెల్ బంతిని కసిగా బాదుతాడు. అతని పవర్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. సిక్సర్లు కొట్టడంలో రస్సెల్‌తో ఎవ్వరూ పోటీపడలేరు. ఐపీఎల్‌లో ఆల్‌రౌండర్లు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ది బెస్ట్ ఆల్‌రౌండర్ మాత్రం ఆండ్రూ రస్సెల్‌యే’ అన్నాడు రింకూ సింగ్. 

22 ఏళ్ల రింకూ సింగ్ రెండేళ్లుగా కోల్‌కత్తా జట్టులో ఆడుతున్నాడు. రంజీల్లో ఇరగదీసిన ఈ కుర్రాడు, ఐపీఎల్‌లో సత్తా చాటి టీమిండియాకు ఆడాలని తపన పడుతున్నాడు.