భారత పారిశ్రామిక దిగ్గజ సంస్థ మహేంద్ర గ్రూప్ ఛైర్మెన్, సీఈవో ఆనంద్ మహేంద్ర... వ్యాపార రంగంతో పాటు క్రికెట్‌ను కూడా బాగా ఫాలో అవుతుంటారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహేంద్ర, వివిధ సామాజిక, సాంఘిక క్రీడా సంబంధిత అంశాలపై స్పందిస్తూ ఉంటారు.

ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్టు సిరీస్ విజయం తర్వాత టూర్ ఆరంభానికి ముందు భారత జట్టుపై ఆసీస్ మాజీ క్రికెటర్లు చేసిన ఆనంద్ మహేంద్ర... ‘ఇప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలను ఎలా తింటారు... గ్రిల్ చేసుకుంటారా?.. ఫ్రై గానా లేక బేక్ చేసుకుంటారా... చపాతీ లేదా దోశలో చుట్టుకుని తింటారా...’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

తాజాగా ఆసీస్ టూర్‌లో అద్భుతంగా రాణించిన భారత యువ క్రికెటర్లు సిరాజ్, నటరాజన్, శుబ్‌మన్ గిల్, నవ్‌దీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్‌లకు మహేంద్ర ఎస్‌యూవీ కార్లను బహుమతిగా ఇస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు ఆనంద్ మహేంద్ర.

తమ సత్తా మీద ఉన్న నమ్మకంతో చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను అధిగమించిన ఈ కుర్రాళ్లుకు ‘థార్ ఎస్‌యూవీ’ బహుమతిగా ఇస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపాడు మహేంద్ర సంస్థ అధినేత.