అజరుద్దీన్ హెచ్ సిఎపై కేటీఆర్ కు అంబటి రాయుడు ఫిర్యాదు
ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్... మాజీ క్రికెటర్ అజారుద్దీన్ నేతృత్వంలో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. వరల్డ్ కప్ సమయంలో జట్టులో తనకు అవకాశం ఇవ్వకపోవడంపై అంబటి చాలా నిరాశకు గురయ్యారు. వెంటనే తాను రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. కొద్ది రోజుల తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
క్రికెటర్ అంబటి రాయుడు సంచలన కామెంట్స్ చేశాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి జరుగుతోందంటూ అంబటి పేర్కొన్నాడు. హెచ్ సీఏలో అవినీతి పై ట్విట్టర్ వేదికగా పేర్కొంటూ... ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చాడు. కాగా... అంబటి చేసిన ట్వీట్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
‘‘ హలో కేటీఆర్ సర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్ సీఏ) లో అవినీతి ఎక్కువగా ఉంది. దానిని తొలగించడానికి మీ సహాయం కోరుతున్నాను. క్రికెట్ జట్టుని డబ్బుతో కొందరు అవినీతి పరులు ప్రభావితం చేయాలని చూస్తున్నారని.. వారందరిపై ఏసీబీ కేసులు కూడా ఉన్నాయని.. వాళ్లు దూరమైనప్పుడే హైదరాబాద్ గొప్పగా తయారౌతుంది’’ అంటూ అంబటి ట్వీట్ చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్... మాజీ క్రికెటర్ అజారుద్దీన్ నేతృత్వంలో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. వరల్డ్ కప్ సమయంలో జట్టులో తనకు అవకాశం ఇవ్వకపోవడంపై అంబటి చాలా నిరాశకు గురయ్యారు. వెంటనే తాను రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. కొద్ది రోజుల తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
ఆ వెంటనే అంబటి రాయుడు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కితీసుకుంటున్నట్లుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించి ఓ లిఖితపూర్వక లేఖను అతడె హెచ్‌సీఏ కు అందించాడు. తాను రిటైర్మెంట్ ప్రకటించడానికి ప్రేరేపించిన కారణాలతో పాటు ఇప్పుడు తన నిర్ణయాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నాడో వివరిస్తూ రాయుడు ఈ లేఖ రాసినట్లు సమాచారం.
ఈ సందర్బంగా అంబటి రాయుడు మాట్లాడుతూ...క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలిచిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా ఐపిఎల్ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి, మాజీ తెలుగు క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, నోయల్ డేవిడ్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేశాడు. తన కెరీర్ గురించి డైలమాలో వున్న సమయంలో వీరు నాకెంతో సహాయం అందించారని రాయుడు తెలిపాడు.
ఇకపై తాను అన్ని ఫార్మాట్లలో క్రికెట్ ఆడేందుకు అందుబాటులో వుంటానని ప్రకటించాడు. అలాగే ఐపిఎల్ కెరీర్ ను యదావిధిగా కొనసాగిస్తానని తెలిపాడు. తానింకా చాలా క్రికెట్ ఆడాల్సివుందని ఈ సందర్భంగా రాయుడు కాస్త భావోద్వేగంగా వెల్లడించాడు.