Ambati Rayudu: భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు(Ambati Rayudu)మరోసారి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన ఆయన  క‌రీబియ‌న్ లీగ్‌(Caribbean Premier League)తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. 

Ambati Rayudu: భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్ మెన్స్ అంబటి రాయుడు (Ambati Rayudu) మరోసారి మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన రాయుడు క‌రీబియ‌న్ లీగ్‌(Caribbean Premier League)తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. బౌలర్లను బంతులను ఊచకోత కోయడానికి సిద్ధ‌మ‌వుతున్నాడు

మీడియా నివేదికల ప్రకారం.. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు సన్నదం అవుతున్నాడు. రాబోయే సీజన్‌లో మార్క్యూ ప్లేయర్‌గా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌ (St Kitts & Nevis Patriots) జ‌ట్టుతో రాయుడు ఒప్పందం చేసుకున్నాడు. దీంతో ఈ లీగ్‌లో ఆడుతున్న రెండో భార‌త క్రికెట‌ర్‌గా రాయుడు రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకు ముందు ప్ర‌వీణ్ తాంబే(Pravin Tambe) ఈ లీగ్‌లో ఆడాడు.

అయితే.. రిటైర్మెంట్ తర్వాత క్రీడాకారులు వెంటనే విదేశీ లీగ్‌లలో పాల్గొనకుండా నిరోధించడానికి.. BCCI కూలింగ్ ఆఫ్ పీరియడ్ విధానాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. అయితే కూలింగ్ ఆఫ్ పీరియడ్ విధానంపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయుడు పాల్గొనగలడా? లేదా ? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రాయుడు లీగ్‌లో భాగమైతే.. ప్రవీణ్ తాంబే తర్వాత సీపీఎల్‌లో ఆడే రెండో ఆటగాడు నిలుస్తాడు. IPL 2023 తర్వాత రాయుడు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రాయుడు 16 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలోని 12 ఇన్నింగ్స్‌లలో అతను 15.78 సగటుతో 130.28 స్ట్రైక్ రేట్‌తో 142 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 27 నాటౌట్. సీజన్‌లో రాయుడు కేవలం 9 ఫోర్లు, 7 సిక్సర్లు మాత్రమే బాదారు. 

మొత్తం ఐపీఎల్ కెరీర్ ను పరిశీలిస్తే.. రాయుడు 203 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలోని 187 ఇన్నింగ్స్‌లలో అతను 28.05 సగటుతో మరియు 127.54 స్ట్రైక్ రేట్‌తో 4348 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 1 సెంచరీ , 22 అర్ధ సెంచరీలు చేశాడు.