IPL 2024 Auction: ఐపీఎల్ 2024 మెగా వేలానికి రంగం సిద్ధం.. పూర్తి వివ‌రాలు ఇవిగో..

IPL 2024 Auction: ఈ ఏడాది ఐపీఎల్ వేలం కోసం మొత్తం 1166 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీ ఆటగాళ్లు కలిపి మొత్తం 333 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది.
 

All you need to know about the IPL 2024 auction, Players , teams, venue RMA

IPL auction 2024: చాలా మంది క్రికెట్ ఆటగాళ్ల భవితవ్యాన్ని నిర్ణయించే రోజు ఐపీఎల్ 2024 వేలం వచ్చేసింది. ఏ ఆటగాళ్ల ఏ జ‌ట్టుకు వెళ్తారు..? ఎవరు అమ్ముడుపోకుండా మిగిలిపోతారు? ఏ ఆటగాళ్ల కోసం జట్లు తమ మ‌నీప‌ర్సును బద్దలు కొడతాయి? సర్ప్రైజ్ పిక్స్ ఏమైనా ఉంటాయా? ఇలాంటి ఆస‌క్తిక‌ర‌మైన ఐఎల్ 2024 వేలం లోని కీల‌క విష‌యాలు మీ కోసం.. 

క్రికెట్ పొట్టి ఫార్మ‌ట్ వేలానికి రంగం సిద్ధ‌మైంది. డిసెంబర్ 19న దుబాయ్ లో ఐపీఎల్ 2024 వేలం పాట జ‌ర‌గ‌నుంది. విదేశాల్లో  ఐపీఎల్ వేలం నిర్వ‌హించ‌డం ఇదే మొద‌టిసారి. ఐపీఎల్ 2025కు ముందు మరో మెగా వేలానికి వెళ్లే ముందు జ‌రిగే చివరి మినీ వేలం ఇది. ఇప్పటికే 10 ఐపీఎల్ జట్లు ఆటగాళ్లను రిటైన్ చేసుకుని, మిగిలిన స్థానాలను భర్తీ చేయాలని చూస్తున్నాయి. గత ఏడాది జరిగిన మెగా వేలానికి భిన్నంగా ఈ వేలం జ‌ర‌గ‌నుంది. మినీ వేలంలో త‌మ జ‌ట్ల‌ల‌లో స‌మ‌తుల్య‌త‌ను సాధించ‌డం, కీల‌క‌మైన స్థానాల‌ను భ‌ర్తీ చేయ‌డం ఆయా ఫ్రాంచైజీలు చూస్తున్నాయి. 

ఎంత‌మంది ఆట‌గాటాళ్లు వేలంలో ఉన్నారు? 

ఈ ఏడాది ఐపీఎల్ వేలం కోసం మొత్తం 1166 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీ ఆటగాళ్లు కలిపి మొత్తం 333 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. ఇందులో 116 మంది ఆటగాళ్లు క్యాప్డ్ కాగా, 215 మంది అన్ క్యాప్డ్ ఆటగాళ్లు, ఇద్దరు అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. 10 జట్లలో మొత్తం 77 స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. ఇందులో 30 విదేశీ ఆటగాళ్లకు కేటాయించారు.

ఒక్కో జట్టు ఎంత ఖర్చు చేయాల్సి ఉంది?

గుజరాత్ టైటాన్స్ వారి పర్సులో అత్యధికంగా రూ.38.15 కోట్లు (సుమారు 4.6 మిలియన్ డాలర్లు) ఉండగా, ఎనిమిది స్లాట్లను (రెండు విదేశీ) భర్తీ చేయాల్సి ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ వద్ద అందుబాటులో ఉన్న అతిచిన్న పర్సు..కానీ ఆరు స్లాట్లను (రెండు విదేశీ) భర్తీ చేయడానికి రూ .13.15 కోట్లు (సుమారు 1.58 మిలియన్ డాలర్లు) ఉన్నాయి. మొత్తంగా ఫ్రాంచైజీల వద్ద రూ.262.95 కోట్లు (సుమారు 31.58 మిలియన్ డాలర్లు) ఉన్నాయి. 

వేలం ఎలా జ‌రుగుతుంది? ఆట‌గాళ్ల జాబితా ఎలా ఉంటుంది? 

ఆటగాళ్లను వారి స్పెషలైజేషన్ ఆధారంగా 19 వేర్వేరు సెట్లుగా విభజించారు: బ్యాట్స్ మ‌న్, ఆల్ రౌండర్, ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్, వికెట్ కీపర్. అలాగే, క్యాప్డ్, అన్ క్యాప్డ్ ప్లేయర్లు మార‌డం. మొత్తం 23 మంది ప్లేయర్లు అత్యధిక బేస్ ప్రైస్ బ్రాకెట్ లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. రూ .2 కోట్లు లిస్టులో ఉన్న‌వారిలో మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ ఉన్నారు. పదమూడు మంది ఆటగాళ్లు తమ బేస్ ప్రైజ్ ను రూ.1.5 కోట్లుగా (సుమారు 1,80,000 డాలర్లు) నిర్ణయించారు.

స్టార్ ప్లేయ‌ర్స్ దూరం..? 

ఈసారి  స్టార్ ప్లేయ‌ర్లు కొంత‌మంది పేర్లు లిస్టు లో లేవు. ఇంగ్లాండ్ త్రయం బెన్ స్టోక్స్, జో రూట్, జోఫ్రా ఆర్చర్ ఈ ఏడాది తమ పనిభారాన్ని నిర్వహించడానికి ఐపీఎల్ నుంచి వైదొలిగారు. ఈ జాబితాలో కేదార్ జాదవ్ లేడు, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్ పేర్లు కూడా లేవు.

ఏ ఆటగాళ్ల కోసం జ‌ట్లు గట్టి పోటీ ఇవ్వనున్నాయి..? 

ఈ వేలంపాట‌లో ప‌లువురు ఆట‌గాళ్ల‌పై అన్ని జ‌ట్లు క‌న్నేశాయి. ఈ జాబితాలో స్టార్క్ పేరు టాప్ లో ఉంటుంది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లో పునరాగమనం చేసిన ఈ ఫాస్ట్ బౌలర్ వేలంలో భారీ మొత్తాన్ని రాబట్టే అవకాశం ఉంది. అలాగే, న్యూజిలాండ్ ప్లేయ‌ర్ రచిన్ రవీంద్ర తన బేస్ ప్రైస్ ను రూ.50 లక్షలు (సుమారు 60,000 డాలర్లు)గా నిర్ణయించాడు. ఇటీవ‌ల అత‌ని వన్డే ప్రపంచ కప్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అంద‌రిదృష్టిని ఆక‌ర్షించాడు. దీంతో అత‌ని కోసం జ‌ట్లు గ‌ట్టిగానే పోటీ ప‌డే అవ‌కాశ‌ముంది. వీరితో పాటు అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్లు కూడా ఉన్నారు. వారిలో అర్షిన్ కులకర్ణి, కుమార్ కుషాగ్రా, ముషీర్ ఖాన్ వంటి వారు ఎక్కువగా డిమాండ్ ఉన్న ఆట‌గాళ్లు.

ఐపీఎల్ 2024 రిటైన్/ట్రేడెడ్ లిస్ట్ బిగ్ స్టార్స్.. 

నవంబర్ 26న ట్రేడింగ్ విండో ముగియడానికి ముందు రిటైన్ చేసిన, విడుదల చేసిన, ట్రేడింగ్ చేసిన ప్లేయర్లను ఇప్ప‌టికే బీసీసీఐ ప్ర‌క‌టించింది. గత సంవత్సరాలకు భిన్నంగా ట్రేడింగ్ విండోలో చివరి నిమిషంలో సంచ‌ల‌నాలు న‌మోద‌య్యాయి. హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు ఆల్ క్యాష్ డీల్లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత ముంబై కెప్టెన్ గా కూడా నియమితుడయ్యాడు. ముంబై కామెరూన్ గ్రీన్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విక్రయించింది.

వేలానికి ముందే జట్లు ఆటగాళ్లను విడుదల చేయవచ్చా? 

ఐపీఎల్ నిబంధనల ప్రకారం, ఒక సీజన్ ముగిసిన నెల తర్వాత ప్లేయర్ ట్రేడింగ్ విండో ప్రారంభమవుతుంది. వేలం తేదీకి ఒక వారం ముందు వరకు తెరిచి ఉంటుంది, ఆపై తదుపరి సీజన్ ప్రారంభానికి ఒక నెల ముందు వరకు కొనసాగుతుంది. వేలం మరుసటి రోజు డిసెంబర్ 20 నుంచి 2024 సీజన్ ప్రారంభానికి నెల రోజుల ముందు వరకు ట్రేడింగ్ సాధ్యమవుతుంది.

ఐపీఎల్2024 వేలం వేసే వ్యక్తి ఎవరు?

ఇటీవల డిసెంబర్ 9న జరిగిన డబ్ల్యూపీఎల్ వేలానికి ఆతిథ్యం ఇచ్చిన మల్లికా సాగర్.. హ్యూ ఎడ్మీడ్స్ నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆమె ఐపీఎల్ 16 ఏళ్ల తర్వాత తొలి మహిళా వేలంపాటదారుగా నిలిచింది. 

ఐపీఎల్ వేలం ఎప్పుడు మొదలవుతుంది? ఎక్కడ చూడ‌వ‌చ్చు..? 

దుబాయ్ లోని కోకాకోలా ఎరీనాలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:00 గంటలకు) ఆటగాళ్ల వేలం జరగనుంది. ఇది స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే, జియోసినిమా యాప్ లో కూడా ఐపీఎల్ 2024 వేలం ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios