ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్‌ జెర్సీ కలర్‌.. బ్లూ.. హెట్‌మైర్‌ తన డ్రెస్‌, షూస్‌ మొత్తం బ్లూ కలర్‌ లో ఉంది. దీనిని చూసే ఫ్యాన్స్‌ కామెంట్‌ చేశారు. హెట్‌మైర్‌ ఈజ్‌ ఆల్‌ బ్లూ.. ముఖానికి కూడా బ్లూ కలర్‌ వేసుకుంటే  సూపర్‌ ఉంటుంది అంటూ కామెంట్‌ చేశారు.

ఐపీఎల్(IPL 2021) సెకండ్ ఫేజ్ చాలా ఉత్సాహంగా జరుగుతోంది. ఒక్కో జట్టు ఒక్కో రీతిలో ఆకట్టుకుంటోంది. కాగా...తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఆటగాడు షిమ్రెన్ హెట్ మైర్(Shimron Hetmyer ) తన ఆటతో కాకుండా.. తన కొత్త లుక్ తో ఆకట్టుకున్నాడు. అతని న్యూ హెయిర్ స్టైల్ కి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆ న్యూలుక్ ఏంటో తెలుసా..? తన హెయిర్ కి బ్లూ కలర్ వేసుకున్నాడు.

ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్‌ జెర్సీ కలర్‌.. బ్లూ.. హెట్‌మైర్‌ తన డ్రెస్‌, షూస్‌ మొత్తం బ్లూ కలర్‌ లో ఉంది. దీనిని చూసే ఫ్యాన్స్‌ కామెంట్‌ చేశారు. హెట్‌మైర్‌ ఈజ్‌ ఆల్‌ బ్లూ.. ముఖానికి కూడా బ్లూ కలర్‌ వేసుకుంటే సూపర్‌ ఉంటుంది అంటూ కామెంట్‌ చేశారు.

Scroll to load tweet…

ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఆదిలోనే ఓపెనర్‌ డెవిడ్‌ వార్నర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విలియమ్సన్‌ మరో ఓపెనర్‌ వృద్దిమాన్‌ షాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న విలియమ్సన్‌ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్‌ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. చివర్లో అబ్దుల్‌ సమద్‌ 28 పరుగులు.. రషీద్‌ ఖాన్‌ 22 పరుగులు చేయడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 130 పరుగుల మార్క్‌ను దాటగలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో రబడ 3, అక్షర్‌ పటేల్‌, నోర్ట్జే చెరో రెండు వికెట్లు తీశారు.