రన్నింగ్ లో గాల్లోకి ముందుకు దూకి అజింక్యా ర‌హానే సంచ‌ల‌న క్యాచ్..

Ajinkya Rahane: ఐపీఎల్ 2024 చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో అజింక్యా రహానే బ్యాటింగ్‌తో రాణించ‌లేక‌పోయాడు కానీ, తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరి దృష్టిని ఆక‌ర్షించాడు. ముందుకు గాల్లోకి ఎగురుతూ అద్భుతమైన క్యాచ్ పట్టాడు.
 

Ajinkya Rahane jumps forward in the air and takes the Sensational Catch CSK vs GT IPL 2024 RMA

Ajinkya Rahane takes sensational running catch: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024)లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఏడో మ్యాచ్ జ‌రిగింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన చెన్నై సూప‌ర్ కింగ్స్ 63 ప‌రుగుల తేడాతో గుజ‌రాత్ ను చిత్తుచేసింది. అయితే, ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మన్ అజింక్య రహానె తన బ్యాటింగ్ తో పెద్దగా రాణించలేకపోయాడు. కానీ తన అద్భుతమైన ఫీల్డింగ్ తో గ్రౌండ్ లో అందరి దృష్టిని ఆక‌ర్షించాడు. ముందుకు గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ అందుకుని అంద‌రినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్ర‌స్తుతం ఈ సూప‌ర్ క్యాచ్ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గామారాయి.

గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో 12వ ఓవర్ ను చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తుషార్ దేశ్ పాండే వేశాడు. ఆ ఓవర్లో ఐదో బంతికి డేవిడ్ మిల్లర్ భారీ షాట్ ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే, అది బౌండ‌రీని దాట‌లేక‌పోయింది. డీప్ ఎక్స్ ట్రా కవర్ వైపు ఫ్లిక్ షాట్ ఆడ‌గా, బౌండరీ లైన్ వద్ద ఉన్న‌ అజింక్య రహానే కాస్త ముందుకు వచ్చి గాల్లోకి ముందుకు దూకి క‌ళ్లు చెదిరే క్యాచ్ ప‌ట్టాడు. స్డేడియంలో ఉన్న గుజ‌రాత్ క్రికెట్ ల‌వ‌ర్స్ తో పాటు అక్క‌డే ఉన్న డేవిడ్ మిల్లర్ భార్య ఆశ్చ‌ర్యంతో ఆమె ముఖంలో నిరాశ క‌నిపించింది. మిల్లర్ 16 బంతుల్లో 21 పరుగుల వద్ద ఔటయ్యాడు.

 

చెన్నై 63 పరుగుల తేడాతో చెన్నై సూప‌ర్ విక్ట‌రీ..

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. శివమ్ దూబే సూప‌ర్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో హాఫ్ సెంచ‌రీ (51) కొట్టాడు. అలాగే, యంగ్ ప్లేయ‌ర్ రచిన్ రవీంద్ర కూడా 46 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 207 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయ‌గ‌లిగింది.

MI VS SRH : 'ముంబై ఇండియ‌న్స్ చేసిన త‌ప్పు అదే.. '

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios