Asianet News TeluguAsianet News Telugu

Ashes 2021-22: ఆస్ట్రేలియా అమ్మాయి.. ఇంగ్లాండ్ అబ్బాయి.. యాషెస్ కలిపింది ఇద్దరినీ...!

Australia Vs England: గతంలో కాలేజీలు, పార్కులు, సినిమా హాళ్ల లోనే ప్రేమికులు ఎక్కువగా లవ్ ప్రపోజ్ చేసేవారు. కానీ అవి మరీ రొటీన్ అనుకున్నారో.. లేక కొత్తగా ట్రై చేద్దామనో గానీ లవర్స్ కూడా రూట్ మార్చారు. క్రికెట్ స్టేడియాలే లవ్ ను ఎక్స్ప్రెస్ చేయడానికి వేదికలవుతున్నాయి. 

Ahses : England fan proposes his Australian girlfriend in front of the crowd
Author
Hyderabad, First Published Dec 10, 2021, 12:40 PM IST

ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాను  వారి స్వదేశంలో ఢీకొంటున్నది. పురాతన వైరంగా పేరున్న యాషెస్ సిరీస్ లో రెండు జట్లు విజయం కోసం హోరాహోరిగా పోరాడుతున్నాయి. కానీ ఈ భీకర క్రికెట్ యుద్ధం మధ్యలో ఓ ప్రేమ పుట్టింది. ఒకవైపు ఈ రెండు జట్లు స్టేడియంలో  నువ్వా నేనా..? అన్నట్టుగా తలపడుతుంటే.. మరోవైపు ఓ ఆస్ట్రేలియా అమ్మాయి.. ఇంగ్లాండ్ అబ్బాయి మాత్రం నువ్వు నేను మనమవుదామని ప్రేమించుకుంటున్నారు. వాళ్ల ప్రేమకు గబ్బా స్టేడియమే వేదికైంది. నాలుగేండ్ల క్రితం ఇదే యాషెస్ సిరీస్ లో మొదలైన ప్రేమకు 2021 యాషెస్ సిరీస్ శుభం కార్డు వేసింది. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇంగ్లాండ్ కు చెందిన రాబ్ హేల్.. నాలుగేండ్ల క్రితం అంటే సరిగ్గా 2017 లో ఇదే యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో నటాలీ ని చూశాడు. తొలి చూపులోనే మనోడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంకేముంది. అప్పట్నుంచి  నాలుగేండ్ల పాటు ఆమెను తన వైపునకు తిప్పుకోవడానికి పడరాని పాట్లు పడ్డాడు. 

 

ఇక ఏదైతే అదవుతుందని బ్రిస్బేన్ లో జరుగుతున్న తొలి టెస్టు  మూడో రోజు ఆమెకు ప్రపోజ్ చేశాడు. ‘నా ప్రేమను అంగీకరిస్తావా..?’ అంటూ  అందరి ముందు చెప్పేశాడు. దీనికి నటాలీ కూడా ఓకే చెప్పడంతో మనోడి లవ్ స్టోరీకి ఎండ్ కార్డు పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

ఇలా క్రికెట్ స్టేడియంలో  లవ్ ను ఎక్స్ప్రెస్ చేయడం ఇదేం కొత్త కాదు. కొద్దికాలంగా ఈ ట్రెండ్ బాగా పాపులర్ అవుతోంది. గతంలో కాలేజీలు, పార్కులు, సినిమా హాళ్లు, ఏవైనా పర్యాటక ప్రదేశాల్లోనే ప్రేమికులు లవ్ ప్రపోజ్ చేసేవారు. కానీ అవి మరీ రొటీన్ అనుకున్నారో.. లేక కొత్తగా ట్రై చేద్దామనో గానీ ప్రేమికులు కూడా రూట్ మార్చారు. వేలాది మంది ముందు.. లక్షలాది మంది టీవీలలో చూస్తుండగా.. తమ ప్రియమైన వారికి ప్రపోజ్ చేస్తున్నారు. 

 

గతేడాది నవంబర్  లో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలో కూడా ఓ భారత అభిమాని.. తన ఆసీస్ గర్ల్ ఫ్రెండ్ కు గ్రౌండ్ లోనే ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. 

ప్రేక్షకులే కాదండోయ్.. ఈ మధ్య క్రికెటర్లు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇటీవలే ముగిసిన  ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దీపక్ చాహర్ కూడా తన గర్ల్ ఫ్రెండ్ కు స్టేడియంలోనే అందరూ చూస్తుండగా ప్రపోజ్ చేశాడు. అందుకే అంటారేమో ప్రేమకు ఎల్లలు లేవని...

Follow Us:
Download App:
  • android
  • ios