MI Emirates Squad: ఐపీఎల్ లోనే కాదు ఇతర దేశాల్లో సాగే క్రికెట్ లీగ్ లలో కూడా ముంబై ఇండియన్స్ దూకుడు చూపెడుతున్నది.  ఫ్రాంచైజీల పేర్లు, జట్ల వివరాలను  ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. 

ఐపీఎల్ తరహాలోనే ఇతర దేశాలలో సైతం ఫ్రాంచైజీ క్రికెట్‌లలో పెట్టుబడులు పెట్టిన ముంబై ఇండియన్స్.. జట్ల పేర్లు, ఆడే సభ్యులను ప్రకటించడంలోనూ దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే ఎంఐ కేప్‌టౌన్ జట్టు పేరుతో పాటు ఐదుగురు ఆటగాళ్లను పరిచయం చేసిన ముంబై.. తాజాగా యూఏఈ ఇంటర్నేషనల్ టీ20లో తమ జట్టుకు ప్రాతినిథ్యం వహించబోయే జట్టును కూడా ప్రకటించింది. వెస్టిండీస్, ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఈ టీమ్ లో పెద్దపీట వేసింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

14 మందితో కూడిన ఈ జట్టులో ముంబై ఇండియన్స్ కు ఆడే ఆల్ రౌండర్, విండీస్ మాజీ సారథి కీరన్ పొలార్డ్ తో పాటు నికోలస్ పూరన్, డ్వేన్ బ్రావో, ఆండ్రూ ఫ్లెచర్ లు కూడా ఉన్నారు. ఇక తమ జట్టుతోనే గతంలో ఆడిన ట్రెంట్ బౌల్ట్ ను కూడా మళ్లీ తమవైపునకు తిప్పుకుంది. 

ఈ మేరకు ఎంఐ ఎమిరేట్స్ జట్టును తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించింది. పైన పేర్కొన్న నలుగురితో పాటు ఇంగ్లాండ్ నుంచి సమిత్ పటేల్, విల్ సమీద్, జోర్డాన్ థాంప్సన్ లు ఉన్నారు. అఫ్ఘనిస్తాన్ బౌలర్ జహీర్ ఖాన్, ఫజల్‌హక్ ఫరూఖీ లను ఎంపిక చేసింది. స్కాట్లాండ్ ఆటగాడు బ్రాడ్లీ వీల్, నెదర్లాండ్స్ ప్లేయర్ బస్ డె లిడె ఉన్నారు. సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ కూ ఇందులో అవకాశం దక్కింది. 

యూఏఈ వేదికగా జరుగబోయే ILT20 జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12వరకు జరగాల్సి ఉంది. లీగ్ మార్గదర్శకాలను అనుసరించి తమ ఫ్రాంచైజీకి ఆటగాళ్లు ఒప్పందాలు చేసుకున్నారని, ఇక స్థానిక (యూఏఈ) క్రికెటర్లు కూడా వీరికి జతకలుస్తారు’ అని ఎంఐ ఎమిరేట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎమిరేట్స్ జట్టును ప్రకటిస్తూ జట్టు ఓనర్ ఆకాశ్ అంబానీ స్పందిస్తూ.. ‘మా జట్టుకు చెందిన 14 మంది ఆటగాళ్లను పరిచయం చేయడానికి సంతోషంగా ఉంది. ముంబై ఇండియన్స్ లో కీలక ఆటగాడైన పొలార్డ్.. ఎమిరేట్స్ లో మాతోనే కొనసాగుతున్నాడు. బ్రావో, బౌల్డ్, పూరన్ లు మళ్లీ మాతో చేతులు కలపనున్నారు. ఎమిరేట్స్ జట్టుకు ఆడబోయే ఆటగాళ్లకు స్వాగతం..’అని పేర్కొన్నాడు. 

Scroll to load tweet…

ఐఎల్‌టీ20కి ఎంఐ ఎమిరేట్స్ జట్టు: కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, అండ్రె ఫ్లెచర్, ఇమ్రాన్ తాహిర్, సమిత్ పటేల్, విల్ సమీద్, జోర్డాన్ థాంప్సన్, నజిబుల్లా జద్రాన్, జహీర్ ఖాన్, ఫరూఖీ, బ్రాడ్లే వీల్, బస్ డె లీడె 

గురువారం ఎంఐ కేప్‌టౌన్ కూడా ఐదుగురు ఆటగాళ్ల పేర్లను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరు సౌతాఫ్రికన్లు కాగా ఇద్దరు ఇంగ్లాండ్ క్రికెటర్లు. ఒకరు ఆఫ్ఘాన్ క్రికెటర్. దక్షిణాఫ్రికా నుంచి డెవాల్డ్ బ్రెవిస్ (అన్ క్యాప్డ్), కగిసొ రబాడాలను తీసుకున్న కేప్‌టౌన్.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరన్ లతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక మరో ఆటగాడిగా టీ20 స్పెషలిస్టు రషీద్ ఖాన్ ను తీసుకుంది. 

Scroll to load tweet…