Asianet News TeluguAsianet News Telugu

జాతీయ జట్టు వద్దు.. లీగులే ముద్దు - బోర్డు కాంట్రాక్టులను వదులుకుంటున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు.. కారణమిదే!

రెండ్రోజుల క్రితం  ఇంగ్లాండ్ విధ్వంసకర ఓపెనర్  జేసన్ రాయ్ ఇంగ్లాండ్  సెంట్రల్ కాంట్రాక్టును వదులుకున్నాడన్న  వార్త   నెట్టింట చక్కర్లు కొట్టింది. 

After Jason Roy, Moeen Ali  also wants To Leaves ECB  Contract For Makor League Cricket
Author
First Published May 27, 2023, 1:16 PM IST

ఏ క్రీడలో అయినా తమ  దేశానికి ప్రాతినిథ్యం వహించడం కంటే గొప్ప గౌరవం ఏముంటుంది. అది  ఒక్కరుగా ఆడే  పరుగు పందెం నుంచి  జట్టుగా ఆడే  క్రికెట్, ఫుట్‌బాల్ వంటి క్రీడలు అయినా దేశానికి  ఆడటం గర్వంగా భావిస్తారు క్రీడాకారులు.  నాలుగేండ్లకోసారి జరిగే ఒలింపిక్స్, వరల్డ్ కప్‌లలో తమ  ప్రతిభను నిరూపించుకుంటూనే దేశాన్ని గెలిపించడానికి  కఠోర శ్రమ చేస్తారు. కానీ  ఇదంతా పాతకాలం ముచ్చట. ఇప్పుడు ట్రెండ్ మారింది. దేశం కంటే   సంపాదనే ముఖ్యం అయిపోయింది. ఫుట్‌బాల్‌, బేస్‌బాల్ వంటి క్రీడల్లో ఇది ఎప్పట్నుంచో ఉన్నా  క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే  ‘లీగ్ వైరస్’  చాపకింద నీరులా  వ్యాపిస్తోంది. తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్‌లో జరుగుతున్న ఘటనలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.. 

రెండ్రోజుల క్రితం  ఇంగ్లాండ్ విధ్వంసకర ఓపెనర్  జేసన్ రాయ్.. ఇంగ్లాండ్   అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా  అదే దేశానికి చెందిన స్పిన్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ కూడా  కాంట్రాక్టు వదులుకున్నాడని  కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ కు ఆడుతున్న న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీషమ్ కూడా గతేడాది ఇలా  సెంట్రల్ కాంట్రాక్టులు వదులుకున్నవారే కావడం గమనార్హం. 

కారణమిదే.. 

ఐపీఎల్-16 లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన జేసన్ రాయ్‌కు  ఆ ఫ్రాంచైజీ బంపరాఫర్ ఇచ్చింది.  ఈ ఏడాది జూలై 13 నుంచి 30 వరకూ అమెరికాలో  బీసీసీఐ ఫ్రాంచైజీలు పెట్టుబడులు పెట్టిన మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)  జరుగనుంది. ఈ లీగ్‌లో ఆడేందుకు గాను  జేసన్ రాయ్‌కు రెండేండ్ల కాలానికి గాను రూ. 36.8 కోట్ల భారీ డీల్ కుదుర్చుకున్నాడని  సమాచారం. కేకేఆర్‌కు ఎంఎల్‌సీలో  లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ అనే టీమ్ ఉంది.  

ఇక మోయిన్ అలీని కూడా తాను కొద్దికాలంగా  ఆడుతున్న  చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ  చెన్నై సూపర్ కింగ్స్.. బుట్టలో వేసుకున్నట్టు తెలుస్తున్నది.  ఎంఎల్‌సీలో టెక్సాస్ ఫ్రాంచైజీని  సూపర్ కింగ్స్ దక్కించుకుంది.  ఈ టీమ్ తరఫున ఆడేందుకు  మోయిన్ అలీకి   కళ్లు చెదిరే ధర అందించిందని  సీఎస్కే, ఈసీబీ వర్గాలు చెబుతున్నాయి. సీఎస్కేకు  ఎంఎల్‌సీతో పాటు దక్షిణాఫ్రికాలో కూడా  జోహన్నస్‌బర్గ్ ఫ్రాంచైజీ ఉంది. కాంట్రాక్టు కుదిరితే   మోయిన్ అలీ..  సీఎస్కేకు ఆస్థాన సభ్యుడవుతాడు.  

 

కాంట్రాక్టులను వదులుకున్నారా..? 

జేసన్ రాయ్ ఈసీబీ కాంట్రాక్టు వదులుకుని  ఎంఎల్‌సీ ఆడుతున్నాడన్న వార్తలపై  అతడు స్పందించాడు. తాను ఈసీబీతో తెగదెంపులు చేసుకోలేదని.. ఇంక్రిమెంటల్  కాంట్రాక్టు (షెడ్యూల్ లేని సమయానికి బోర్డు చెల్లించే డబ్బులను వదులుకోవడం)  వదులుకున్నానని వివరణ ఇచ్చాడు. సింగిల్ ఫార్మాట్ (వన్డే) ప్లేయర్ అయిన  రాయ్‌తో పాటు అలీ కూడా దాదాపు ఇదే జాబితాలో ఉన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios