నీకు ఐపీఎల్ చాలు.. కెఎల్ రాహుల్‌ను ఆటాడుకుంటున్న నెటిజన్లు.. పంత్‌ను ఆడించాలని డిమాండ్..

IND vs NED: టీ20 ప్రపంచకప్ లో టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ వరుస వైఫల్యాలు అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  పాకిస్తాన్ తో  తొలి మ్యాచ్ లో చేతులెత్తేసిన రాహుల్.. తాజాగా పసికూన నెదర్లాండ్స్ మీద కూడా విఫలమయ్యాడు. 
 

After back to Back Flops, Netizens Brutally Trolls KL Rahul, Calls He Will shine in IPL 2023

భారత జట్టుకు వైస్ కెప్టెన్ హోదాలో  టీ20 ప్రపంచకప్ లో అడుగుపెట్టిన కెఎల్ రాహుల్..  వరుసగా రెండు మ్యాచ్ లలోనూ విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు.  పాకిస్తాన్ తో  తొలి మ్యాచ్ లో 45 పరుగులే చేసి నసీమ్ షా  వేసిన బంతిని వికెట్ల మీదకు ఆడుకుని పెవిలియన్ చేరిన రాహుల్..  గురువారం నెదర్లాండ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కూడా 9 పరుగులకే  వాన్ మీకెరెన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో  సోషల్ మీడియా వేదికగా రాహుల్ పై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. 

ముఖ్యంగా ట్విటర్ లో రాహుల్ పై మీమ్స్, ట్రోల్స్ పేలుతున్నాయి.  నువ్వు జాతీయ జట్టుకు పనికిరావని.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో అని నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. నెదర్లాండ్స్ తో కూడా ఆడకుంటే ఇంకా నువ్వు ఏ  జట్టు మీద ఆడతావు..? అని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ట్విటర్ లో పలువురు స్పందిస్తూ.. ‘విఫలమవడంలో కెఎల్ రాహుల్ మరోసారి అద్భుతంగా ఆడాడు.. గ్రేట్ జాబ్..’, ‘మనం  కెఎల్ రాహుల్ గాయాన్ని మాన్పించుకోవాలని చాలాకాలంగా చెబుతూనే ఉణ్నాం. అది ద్వైపాక్షిక సిరీసా..? టీ20 ప్రపంచకప్ అనేది సంబంధం లేదు. అతడు ప్రతీచోట విఫలమవుతూనే ఉన్నాడు.   అతడిని తొలగించి ఇప్పటికైనా రిషభ్ పంత్ ను జట్టులోకి తీసుకోవాలి. అప్పుడు టీమిండియాకు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ తో ఓపెనింగ్ జోడీ అయినా దొరుకుద్ది..’, ‘ఏం పర్లేదు.. రాహుల్ గురించి చింతించకండి.. అతడు ఐపీఎల్-2023లో కచ్చితంగా ఆడతాడు..’ అని   వ్యంగ్య బాణాలు విసురుతున్నారు. 

 

 

 

మరికొంతమంది సునీల్ శెట్టి  పాత బాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వీడియోలతో రాహుల్ ను తిట్టినట్టుగా  మీమ్స్ క్రియేట్ చేస్తూ ఫన్ ను పంచుతూనే  అతడికి కౌంటర్ ఇస్తున్నారు. ‘అతడు ప్రపంచ క్రికెట్ లో అతి పెద్ద మోసం..’ అని ఓ యూజర్ కామెంట్ చేయడం గమనార్హం. ప్యాషనేట్ ఫ్యాన్ అని రాసి ఉన్న ఓ యూజర్.. ‘నేను రాహుల్ కు పెద్ద ఫ్యాన్ ను.  కానీ ప్రస్తుతం అతడి ఆట చూస్తే రాహుల్ ను జట్టు నుంచి తప్పించడం మంచిది..’ అని కామెంట్ చేశాడు. 

 

 

రాహుల్ కు బదులుగా   వికెట్ కీపర్ రిషభ్ పంత్ ను  జట్టులోకి తీసుకోవడం మంచిదని  పలువురు క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియా మేనేజ్మెంట్ కు సూచిస్తున్నారు. పంత్ ను తుది జట్టులోకి తీసుకుంటే ఓపెనింగ్ జోడీగా కూడా పంపొచ్చని.. తద్వారా కుడి, ఎడమ చేతి వాటం ఓపెనింగ్ జోడీ ఉంటుందని చెబుతున్నారు. టీమ్ మేనేజ్మెంట్  ఈ సూచనలను పరిగణనలోనికి తీసుకుంటుందా..? అనేది  వేచి చూడాలి మరి.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios