ఆ మ్యాచ్ లో అదరగొట్టాలని అందరూ అనుకుంటారు. కానీ.. మహ్మద్ మాత్రం చెత్త రికార్డు నమోదు చేసి... అప్రతిష్ట మూటకట్టుకున్నాడు. 

ఆసియా కప్ 2022లో భాగంగా బుధవారం పాకిస్తాన్- ఆప్గనిస్తాన్ దేశాలు తలపడ్డాయి. కాగా... ఈ మ్యాచ్ లో ఆప్గనిస్తాన్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చివరకు పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ సంగతి పక్కన పెడితే... ఈ మ్యాచ్ లో ఆప్గనిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ తన కెరీర్ లో నే చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నిజానికి నిన్నటి మ్యాచ్ మహ్మద్ నబీకి వందో మ్యాచ్. ఏ క్రికెటర్ కి అయినా.. వందో మ్యాచ్ అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది. ఆ మ్యాచ్ లో అదరగొట్టాలని అందరూ అనుకుంటారు. కానీ.. మహ్మద్ మాత్రం చెత్త రికార్డు నమోదు చేసి... అప్రతిష్ట మూటకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో మహ్మద్ నబీ గోల్డెన్ డక్ గా వెనుదిరగడం గమనార్హం. తద్వారా నబీ టి20 క్రికెట్ లో చెత్త రికార్డు నమోదు చేశాడు.

టి20ల్లో వందో మ్యాచ్ లో గోల్డెన్ డక్ అయిన తొలి ఆటగాడిగా మహ్మద్ నబీ నిలిచాడు. ఇక నబీ వరసగా ఎనిమిదో మ్యాచ్ లో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. చివరగా ఆడిన ఎనిమిది టీ 20 మ్యాచుల్లో నబీ స్కోర్లు 5,9,6,5,0,8,1,0 గా ఉన్నాయి. ఇందులో రెండు గోల్డెన్ డక్ లు ఉండటం గమనార్హం.