Asianet News TeluguAsianet News Telugu

ఆస్ట్రేలియా మహిళా జట్టు రికార్డు విజయం... వరుసగా 22 వన్డేల్లో గెలిచి చరిత్ర...

2018, మార్చిలో చివరిసారిగా వన్డే మ్యాచ్‌లో ఓడిన ఆస్ట్రేలియా మహిళా జట్టు...

వరుసగా 22 వన్డేల్లో విజయాలు అందుకుని, రికీ పాంటింగ్ జట్టు రికార్డును అధిగమించిన మెగ్ లానింగ్...

22 Consecutive ODI Wins for Australia Women Team CRA
Author
India, First Published Apr 4, 2021, 12:32 PM IST

వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియా మహిళా జట్టు చరిత్ర క్రియేట్ చేసింది. ఓటమి లేకుండా వరుసగా అత్యధిక మ్యాచుల్లో గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది మెగ్ లానింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా మహిళా జట్టు.

2003 వరల్డ్‌కప్ సమయంలో వరుసగా 21 మ్యాచుల్లో గెలిచి, వరుసగా అత్యధిక వన్డేల్లో గెలిచిన జట్టుగా ఉండేది రికీ పాంటింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా పురుషుల జట్టు. ఆ రికార్డును చెరిపేసిన వుమెన్స్ టీమ్, సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఈ రికార్డు సొంతం చేసుకుంది. 2018, మార్చి 12న చివరిసారిగా వన్డేల్లో పరాజయం చవిచూసిన ఆసీస్ మహిళా జట్టు, ఆ తర్వాత ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్‌పై సిరీస్‌లను క్వీన్‌స్వీప్ చేసింది.

న్యూజిలాండ్‌తో మరో రెండు వన్డేలు ఆడనున్న ఆసీస్, ఆ రెండు గెలిస్తే తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios