Asianet News TeluguAsianet News Telugu

41 బంతుల్లో 144 పరుగులు... 18 సిక్సర్లతో తుఫాను ఇన్నింగ్స్.. క్రిస్ గేల్ రికార్డు బ‌ద్ద‌లు

Fastest T20 Century Record : వెస్టిండీస్ స్టార్, యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌డం అసాధ్యం అనుకున్నారు కానీ, ఇప్పుడు అది బ్రేక్ అయింది. టీ20 క్రికెట్ లో అత్యంత వేగ‌వంత‌మైన సెంచ‌రీ న‌మోదైంది. 
 

144 runs from 41 balls. A stormy innings with 18 sixes. Sahil Chauhan breaks Chris Gayle's record RMA
Author
First Published Jun 18, 2024, 12:31 AM IST

Fastest T20 Century Record :  2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు త‌ర‌ఫున ఆడుతున్న వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్, యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ సాధించాడు. పూణె వారియర్స్ పై సాధించిన ఈ సెంచ‌రీ రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌డం చాలా కాలం నుంచి అసాధ్యంగానే మిగిలిపోయింది. ఈ రికార్డు బద్దలవుతుందని ఎవరూ అనుకోలేదు. గేల్ ఈ రికార్డు 11 ఏళ్ల పాటు చెక్కుచెదరలేదు కానీ, ఇప్పుడు (2024) బ‌ద్ద‌లైంది. టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఇప్పుడు గేల్ పేరిట లేదు.

27 బంతుల్లో సెంచరీ.. సిక్స‌ర్ల మోత అంటే ఇదే.. 

ఎస్టోనియా బ్యాట్స్‌మెన్ సాహిల్ చౌహాన్ ఇప్పుడు సైప్రస్‌పై తుఫాను ఇన్నింగ్స్ ఆడి గేల్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టి చ‌రిత్ర సృష్టించాడు. జూన్ 17 (సోమవారం) సైప్రస్‌లోని ఎపిస్కోపిలో జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు. సాహిల్ 41 బంతుల్లో 144 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేవలం 27 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి గేల్ రికార్డును బద్దలు కొట్టాడు.

అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమీబియాకు చెందిన యాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ పేరిట ఉంది. 2023లో నేపాల్‌పై 33 బంతుల్లో సెంచరీ సాధించాడు. సాహిల్ అత‌ని రికార్డును కూడా బ‌ద్ద‌లు కొట్టాడు. ఈ ఎస్టోనియా బ్యాట్స్‌మెన్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. 6 ఫోర్లు, 18 సిక్సర్లతో స్ట్రైక్ రేట్ 351.21తో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. అలాగే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా మ‌రో రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కూడా సాహిల్ రికార్డు సృష్టించాడు. త‌న ఇన్నింగ్స్ లో 18 సిక్సర్లు కొట్టాడు. గతంలో ఈ రికార్డు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన హజ్రతుల్లా జజాయ్ పేరిట ఉంది. 2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 సిక్సర్లు బాదాడు.

IND VS SA, 1ST ODI: స్మృతి మంధాన సూప‌ర్ సెంచ‌రీ.. 143 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసిన భార‌త్

 

 

ఎస్టోనియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సైప్రస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసింది. సాహిల్‌ ఇన్నింగ్స్‌లో ఎస్టోనియా 13 ఓవర్లలో 4 వికెట్లకు 194 పరుగులు చేసి విజయం సాధించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios