టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రెండు రికార్డులు నమోదవ్వబోతున్నాయి. అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరగనున్నమొదటిటెస్టు మ్యాచ్‌లో ఈ రెండు రికార్డులు కోహ్లిని ఊరిస్తున్నాయి. క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా రికార్డులను బద్దలుకొట్టే సువర్ణవకాశం కోహ్లి ముందుంది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రెండు రికార్డులు నమోదవ్వబోతున్నాయి. అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరగనున్నమొదటిటెస్టు మ్యాచ్‌లో ఈ రెండు రికార్డులు కోహ్లిని ఊరిస్తున్నాయి. క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా రికార్డులను బద్దలుకొట్టే సువర్ణవకాశం కోహ్లి ముందుంది.
ఇంతకీ ఆ రికార్డులు ఏంటీ అంటే.. ఇప్పటివరకు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అడిలైడ్ వేదికగా ఆసీస్‌పై అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా మొదటి స్థానంలో ఉన్నాడు. అడిలైడ్ వేదికలో 4 మ్యాచ్‌లాడిన లారా 76.25 సగటుతో 610 పరుగులు సాధించాడు. వీటిలో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.
కాగా ఈ రికార్డును బ్రేక్ చేయడానికి అతి దగ్గరలో కోహ్లీ ఉన్నాడు. ఇప్పటికే కోహ్లి అడిలైడ్ వేదికగా 71.83 సగటుతో 431 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలున్నాయి. కోహ్లి లారా రికార్డును బ్రేక్ చేసేందుకు మరో 179 పరుగులు చేయాల్సి ఉంది. మొదటి టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కోహ్లి ఆ పరుగులు చేస్తే లారా పేరిట ఉన్న రికార్డును చెరిపేసి తాను నంబర్‌వన్ స్థానాన్ని అధిగమిస్తాడు.
ఇక రెండో రికార్డు విషయానికి వస్తే... మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టీమిండియా తరపున ఆస్ట్రేలియాపై వారి సొంతగడ్డపై 20 మ్యాచ్‌ల్లో 6 సెంచరీలు సాధించాడు. ఈ ఐకానిక్ ప్లేయర్ ఆసీస్ గడ్డపై 20 మ్యాచ్‌ల్లో 1809 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి కూడా సచిన్‌తో సమానంగా ఆరు సెంచరీలు సాధించాడు. అడిలైడ్‌లో కోహ్లి ఒక్క సెంచరీ సాధించినా సచిన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంటుంది.
ఇక కోహ్లి ఆసీస్ గడ్డపై 12 మ్యాచ్‌లాడి 1274 పరుగులు సాధించాడు. అలా కోహ్లికి ఒకే మ్యాచ్‌లో రెండు రికార్డులు సాధించే అరుదైన అవకాశం లభించింది. కాగా కోహ్లి మొదటి టెస్టు తర్వాత పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వెళ్లనున్న సంగతి తెలిసిందే. కోహ్లి స్థానంలో అజింక్యా రహానే మిగిలిన టెస్టులకు నాయకత్వం వహించనున్నాడు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 16, 2020, 11:53 AM IST