క్రికెట్ ప్రియులందరికీ  ఎంతో ఇష్టమైన ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడానికి మరెన్నో రోజులు లేవు. ఇప్పటికే ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. జట్టు కెప్టెన్ లు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ...  ప్రాక్టీస్ మ్యాచులు మొదలు పెట్టారు.

Also Read ధోని ఈజ్ బ్యాక్: 5 బంతుల్లో 5 సిక్సులు... వీడియో వైరల్...

తాజాగా.. కోహ్లీ కూడా తన వంతు ప్రయత్నాలు తాను మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు కోహ్లీ కెప్టెన్ గా కొనసాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. కాగా... ఈ సారి మాత్రం కప్పు మాదేనంటూ కోహ్లీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు ప్రమోషనల్ ప్రోమో ఒకటి విడుదల చేశారు. ఆర్సీబీ ఫాన్స్ సంబరపడే విధంగా ఈ వీడియోని తయారు చేశారు. ఇప్పటి వరకు 12 సీజన్స్ లో ఒక్కసారి కూడా కప్పు గెలవకపోయినా... ఈ 13వ సీజన్ లో మాత్రం కచ్చితంగా గెలిచితీరుతాము అనే అర్థం వచ్చేలా ఈ వీడియో చేశారు. 

ఈ వీడియోని ఇండియన్ ప్రీమియర్ లీగ్... తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. కాగా... ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో చివర్లో కనిపించిన కోహ్లీ.. ‘‘ వివో ఐపీఎల్ 13 నాదే’’ అంటూ ఫినిషింగ్ ఇచ్చారు. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ వీడియోపై మీరు కూడా ఓసారి కన్నేయండి.

 

ఇదిలా ఉండగా... ఒక్క ఆర్సీబీ మాత్రమే కాదు.. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒక్కసారిగా ట్రోఫీని దక్కించుకోలేదు. ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న ఈ సీజన్ లో చివరిదాకా నిలిచేది ఎవరో... గెలిచేది ఎవరో వేచి చూడాల్సిందే.