ఆస్ట్రేలియా గడ్డపై ఆ దేశ జట్టుతో టెస్టు సిరీస్ కోసం పాకిస్తాన్ తలపడుతోంది.  అయితే... పాక్ బ్యాట్స్ మెన్లు ఎంత రెచ్చిపోయి ఆడినా ఆ జట్టుకి కలిసి రావడం లేదు.  ఇద్దరు పాక్ క్రికెటర్లు శతకాలు చేసినా లాభం లేకుండా పోయింది. 

యాసిర్‌ షా శతకం, బాబర్‌ అజామ్‌ల పోరాటం పాకిస్తాన్‌ను ఫాలో ఆన్‌ ప్రమాదం నుంచి మాత్రం తప్పించలేకపోయాయి. పాకిస్తాన్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌట్‌ అవడంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించాల్చి వచ్చింది.

ఆసీస్ కెప్టెన్ టిమ్ పెయిన్ పాకిస్తాన్ ను ఫాలో ఆన్ ఆడవాలిసిందిగా చెప్పడంతో పాకిస్తాన్ ఆడక తప్పలేదు.ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరు కంటే 287 పరుగులు వెనుకబడింది.

ఆసీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో పాకిస్తాన్‌ స్పిన‍్నర్‌ యాసిర్‌ షా ఒక చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు. నాలుగు వికెట్లు మాత్రమే తీసి నాలుగు వందలకు పైగా పరుగులిచ్చి అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేశాడు. 

AlsoRead నెంబర్ 8 సెంచరీ వృధా... అయినా పాకిస్తాన్ కు తప్పని ఫాలో ఆన్...

ఈ నేపథ్యంలో యాసిర్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే... ఆ తర్వాత బ్యాటింగ్ విషయంలో యాసిర్ షా చెలరేగిపోయాడు. శతకం చేసి.. తనేంటో నిరూపించుకున్నాడు.  కాగా... తాజాగా దీనిపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. యాసిర్ షా బాగా ఆడాడడని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో సెంచరీ చేసి 8వ నెంబర్ బ్యాట్స్ మెన్ స్థానానికి చేరుకున్నాడు. ఇక మిగిలిన బ్యాట్స్ మెన్స్ అంటారా.. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి అంటూ షోయబ్ అక్తర్ ట్వీట్ చేశాడు. అదే ట్వీట్ లో బాబర్ కూడా బాగా ఆడాడు అంటూ మెచ్చుకున్నాడు. 

ఒక్క యాసిర్ షా మాత్రమే సరిగా ఆడాడని.. యాసిర్, బాబర్ లు ఎంత కష్టపడినా విజయం దక్కలేదనే భావనను వ్యక్తం చేస్తూ..టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ సరిగా లేదంటూ అక్తర్ ఈ ట్వీట్ చేశాడు.