సిడ్నీ: టెస్టు క్రికెట్ లో అంతగా రాణించని న్యూజిలాండ్, ఇంగ్లాండు జట్లకు ఐసిసి రెండు, నాలుగు స్థానాలు ఇచ్చిందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ అన్నారు. ఐసిసి ర్యాంకింగ్స్ గురించి తాను నిజాయితీగా మాట్లాడుతున్నానని, అవి ఉత్త చెత్త అని ఆయన అన్నారు. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ మీడియాతో ఆయన ఆ విధంగా ఉన్నారు. 

గత రెండేళ్లుగా న్యూజిలాండ్ చాలా సిరీస్ లను గెలుకోవడం వల్ల వారికి రెండో ర్యాంక్ ఇచ్చిందని భావించవచ్చునని, ఇంగ్లాండుకు మూడో ర్యాంక్ (ప్రస్తుతం నాలుగో ర్యాంక్) ఇచ్చారని, గత మూడు నాలుగేళ్ల నుంచి ఇంగ్లాండు టెస్టు క్రికెట్ లో సమస్యలను ఎదుర్కుంటోందని ఆయన అన్నారు. 

ఇంగ్లాండు స్వదేశంలో సిరీస్ ను గెలిచిందని, యాషెస్ సిరీ,స్ ను డ్రా చేసిందని, కేవలం ఐర్లాండుపై గెలిచిందని, అందువల్ల ర్యాంకింగ్స్ కొంత అయోమయంగా ఉన్నాయని ఆయన అన్నారు. కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా టెస్టు మ్యాచుల్లో బాగా రాణిస్తోందని ఆయన అన్నారు. 

ఆస్ట్రేలియాకు ఐదో ర్యాంక్ ఇచ్చారని, ర్యాంకింగ్ పట్టికకూ ఆస్ట్రేలియా ప్రదర్శనకు మధ్య పొంతన కుదరడం లేదని ఆయన అన్నారు. ప్రపంచంలో ఇండియా, ఆస్ట్రేలియా ఉత్తమ టెస్టు మ్యాచ్ జట్లు, ఇందులో సందేహం లేదని అని ఆయన అన్నారు. 12 నెలల క్రితం ఆస్ట్రేలియాను ఇబ్బంది పెట్టింది ఒక్కటే జట్టు అని, అది ఇండియా అని, ఇక్కడికి వచ్చి విజయం సాధించిందని ఆయన అన్నారు. 

ఆస్ట్రేలియాను ఢీకొన గల సత్తా ఉన్న జట్టు ప్రపంచంలో ఒక్కటే ఉందని, అది ఇండియా అని ఆయన అన్నారు.