ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్రిస్మస్, న్యూయర్ వేడుకలను రద్దు చేసిన ఢిల్లీ ప్రభుత్వం
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. న్యూయర్, క్రిస్మస్ వేడుకలపై ఆంక్షలు విధించింది. అందరూ తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది.
ఒమిక్రాన్ పంజా విసురుతోంది. అంతకు అంతకు తనని తాను విస్తరించుకుంటూ పోతోంది. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు అన్ని దేశాలకు విస్తరిస్తుంది. ఇప్పటి వరకు 37 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా తెలిపింది. అయితే మన దేశంలోనూ ఇప్పడు దీని సంఖ్య డబుల్ సెంచరినీ దాటింది. ప్రతీ రోజు దీని కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల మొదటి వారంలో ఈ ఒమిక్రాన్ వేరియంట్ ను మన దేశంలో మొదటి సారిగా గుర్తించారు. ఇప్పుడు ఈ సంఖ్య రెండు వందలను దాటింది. దీంతో అన్ని రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాయి.
ఢిల్లీలో 125కి చేరిక..
దేశ రాజధానిని ఒమిక్రాన్ కలవరపెడుతోంది. బుధవారం వరకు ఢిల్లీలో కేసులు 125కి చేరుకున్నాయి. దీంతో ఇక ఆంక్షలు పెట్టడం ప్రారంభించింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ ఏడాది క్రిస్‌మస్, న్యూయర్ వేడుకలను రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఇతర అన్ని రకాల కల్చరల్ ప్రొగ్రామ్స్ నిర్వహించకూడదని, సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలని డీడీఎంఏ తెలిపింది. చాలా తక్కువ మందితో, కరోనా నిబంధనలు అనుసరిస్తూనే చిన్న చిన్న సమావేశాలు, వివాహాలు, ఇతర వేడుకలు నిర్వహించుకోవాలని చెప్పింది. కరోనా నిబంధనలు అనుసరించి విద్యా సంస్థలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. 50 శాతం మందితో బార్లు, రెస్టారెంట్లు నడుపుకోవచ్చని చెప్పింది. మెట్రో ప్రయాణానికి కూడా కొన్ని ఆంక్షలు విధించింది. ప్రతీ మెట్రో కోచ్‌లో ముప్పై మంది మాత్రమే ఉండాలని చెప్పింది. అంత్యక్రియల వంటి కార్యక్రమాలకు రెండు వందల మందిని అనుమతిస్తామని చెప్పింది.
ఒమిక్రాన్ టెన్షన్.. అనధికారికంగా బూస్టర్ డోసులు వేసుకుంటున్న ప్రజలు..
ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పింది. ప్రతీ ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని ఆదేశించింది. అందరూ కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించింది. కఠిన నిబంధనలు అమలు చేయాలని ఢిల్లీ పోలీసులకు సూచించింది. ప్రతీ రోజు కరోనా నిబంధలు అందజేయాలని అధికారులను ఆదేశించింది. మాస్కు లేకుండా ఎవరినీ అనుమతించకూడదని వ్యాపార సంస్థలకు సూచించింది. క్రిస్మస్, న్యూయర్ వేడుకలకు ముందే కరోనా ఏ ఏ ప్రాంతాల్లో, ఎంతలా విస్తరించి ఉందో తెలియజేయాలని అధికారులను ఆదేశించింది. ఎక్కడెక్కడ రద్దీ ఉండే అవకాశం ఉంటుంది ? ఎక్కడ ప్రజలు గుమిగూడుతారు వంటి విషయాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ అలెర్ట్ చేయాలని సూచించింది.
కోవిషీల్డ్ తీసుకున్న మూడు నెలలే రక్షణ - కొత్త అధ్యయన ఫలితాలు వెల్లడించిన లాన్సెట్ జర్నల్
కర్నాటకలోనూ ఆంక్షలు..
ఢిల్లీ ప్రభుత్వం న్యూయర్, క్రిస్మస్ వేడుకలపై ఆంక్షలు విధించకముందే కర్నాటక ప్రభుత్వం కూడా ఈ విధంగా ఆంక్షలు విధించింది. కర్నాటకలో కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన రోజు ఉన్నతాధికారులు, కరోనా వైరస్ నిపుణుల కమిటీ సభ్యులు మంగళవారం సమావేశమయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి, రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.. కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. రాష్ట్రంలోని ప్రజలందరూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. వ్యాక్సిన్ వేసుకోనివారు పబ్బులు, రెస్టారెంట్లలో వేడుకల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది.