వామ్మో.. కోవిడ్ కొత్త వేరియంట్.. పలు దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న BA.4.6 కేసులు
కరోనా మనుషుల్ని వదలడం లేదు. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్ యూకే, యూఎస్ లో వేగంగా వ్యాప్తి చెందుతోంది.
మళ్లీ కోవిడ్ కొత్త వేరియంట్ వస్తోంది. BA.4.6 గా పరిగణిస్తున్న ఈ సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా యూకే, యూఎస్ఏ వంటి దేశాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) నుంచి కోవిడ్ వేరియంట్లపై తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ కొత్త వేరియంట్ ఆగస్ట్ 14వ తేదీ సమయంలో UKలో 3.3 శాతం నమూనాలను కలిగి ఉండగా.. ఇప్పుడది 9 శాతానికి పెరిగింది.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్స్ ప్రకారం.. BA.4.6 ఇప్పుడు US అంతటా ఇటీవలి కేసులలో 9 శాతానికి పైగా ఉంది. ప్రపంచంలోని అనేక ఇతర దేశాలలో కూడా ఈ వేరియంట్ గుర్తించారు. కాగా.. BA.4.6 అనేది ఓమిక్రాన్ కు చెందిన BA.4 రూపాంతర సంతతి. BA.4 మొదటి సారిగా జనవరి 2022లో దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు. అప్పటి నుంచి BA.5 వేరియంట్ తో పాటు ప్రపంచమంతటా వ్యాపించింది.
BA.4.6 ఎలా ఉద్భవించిందో పూర్తిగా స్పష్టంగా తెలియలేదు, కానీ అది రీకాంబినెంట్ వేరియంట్ కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. SARS-CoV-2 (COVID-19కి కారణమయ్యే (వైరస్) రెండు వేర్వేరు రకాలు ఒకే వ్యక్తికి ఒకే సమయంలో సోకినప్పుడు ఇలా పునఃసంయోగం జరుగుతుంది. BA.4.6 అనేక విధాలుగా BA.4ని పోలి ఉంటుంది, ఇది వైరస్ ఉపరితలంపై ఉన్న ప్రోటీన్ అయిన స్పైక్ ప్రోటీన్ కు మ్యూటేషన్ ను కలిగి ఉంటుంది. ఈ ప్రోటీన్ మనిషి కణాలలోకి ప్రవేశించడానికి సులభతరం చేస్తుంది.
లఖింపూర్ లో దారుణం.. చెట్టుకు వేలాడుతూ ఇద్దరు దళిత అక్కాచెళ్లెల్ల మృతదేహాలు
పాత వేరియంట్ల తో పోలిస్తే ఓమిక్రాన్ ఇన్ ఫెక్షన్ లు కొంచెం తక్కువ తీవ్రతను కలిగి ఉంటుంది. దీని ప్రభావం కూడా తక్కువగానే ఉంటుంది. దీని వల్ల మరణాలు కూడా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. BA.4.6 కూడా ఇలాగే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. నిజానికి ఈ మ్యూటేషన్ వల్ల తీవ్ర లక్షణాలు ఉంటాయని ఇప్పటి వరకు నివేదికలు లేవు.
కానీ ఓమిక్రాన్ సబ్ వేరియంట్లు మునుపటి వేరియంట్ల కంటే ఎక్కువ ట్రాన్స్ మిసిబుల్ గా ఉంటాయని కూడా తెలిసిందే. రోగనిరోధక వ్యవస్థ నుండి తప్పించుకోవడంలో BA.5 కంటే BA.4.6 కొంచెం మెరుగ్గా కనిపిస్తోంది. ఇదే ప్రస్తుతం ఆధిపత్య వేరియంట్. ఈ సమాచారం ప్రిప్రింట్ (ఇంకా పీర్-రివ్యూ చేయని అధ్యయనం)పై ఆధారపడి ఉన్నప్పటికీ.. ఇతర అభివృద్ధి చెందుతున్న డేటా దీనికి రుజువు చేస్తోంది.
విమాన సిబ్బందికి డీజీసీఎ కీలక ఉత్తర్వులు .. విధుల్లో చేరాలంటే.. ఆ పరీక్ష తప్పనిసరి..
UKHSA నివేదికల ప్రకారం.. ఇంగ్లాండ్ లో BA.5 కంటే BA.4.6 6.55 వేగంగా వ్యాపించే అవకాశం ఉందని ముందస్తు అంచనాలు సూచిస్తున్నాయి. BA.4.6 సంక్రమణ ప్రారంభ దశలలో మరింత త్వరగా పునరావృతమవుతుంది. అయితే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ వేరింయట్ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.