Omicron subvariant : మహారాష్ట్రలో మొదటి ఒమిక్రాన్ BA.4, BA.5 సబ్‌వేరియంట్ కేసులు గుర్తింపు..
ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పట్టి, అంతా చక్కబడుతుందని అనుకుంటున్న సమయంలో మరో వేరియంట్ తన పరిధిని పెంచుకుంటోంది. ఒమిక్రాన్ కు చెందిన BA.4, BA.5 సబ్‌వేరియంట్ కేసులు పలు చోట్ల నమోదు అవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో మొదటి సారిగా గుర్తించారు.
మహారాష్ట్ర శనివారం తన మొదటి కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కొత్త వేరియంట్ కేసులను నమోదు చేసింది. పూణేలో ఒమిక్రాన్ స్ట్రెయిన్ BA.4, BA.5 సబ్‌వేరియంట్ లకు సంబంధించిన ఏడు కేసులను గుర్తించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మొత్తం జెనోమిక్ సీక్వెన్సింగ్ లో పూణే నుండి వచ్చిన 7 కేసులలో 4 గురు రోగులకు BA.4 వేరియంట్, మిగిలిన ముగ్గురికి BA.5 వేరియంట్ సోకినట్టు కనుగొన్నారు.
Monkeypox Virus: భయపడాల్సినవసరం లేదు.. కానీ, ఈ లక్షణాలు ఉంటే.. : ICMR
ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) గతంలో తమిళనాడు, తెలంగాణలో BA.4, BA.5 వేరియంట్‌లతో కేసులను నిర్ధారించింది. ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలో హైదరాబాద్‌లో BA.4 వేరియంట్‌కు సంబంధించి దేశంలో మొట్టమొదటి కేసు నమోదు అయ్యింది. మే ప్రారంభంలో అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర లేని 19 ఏళ్ల మహిళలో BA.4 కేసు చెన్నైలో గుర్తించారు. INSACOG ప్రకారం.. ఆమె పూర్తిగా కోవిడ్ 19 వ్యాక్సిన్ లు తీసుకున్నారు. అయితే ఆమెకు తేలికపాటి క్లినికల్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు.
Covid-19: కరోనా.. మంకీపాక్స్ భయాల మధ్య 16 దేశాల ప్రయాణాలపై సౌదీ అరేబియా ఆంక్షలు !
దక్షిణాఫ్రికాకు చెందిన ఒక ప్రయాణికుడిలో హైదరాబాద్ విమానాశ్రయంలో శాంప్లింగ్ సమయంలో ఞక BA.4 కేసు కనుగొనబడింది. అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర లేని హైదరాబాద్‌కు చెందిన 80 ఏళ్ల వ్యక్తిలో BA.5 ను గుర్తించారు. అతడు కూడా కోవిడ్-19 పూర్తి వ్యాక్సిన్ తీసుకొని ఉన్నాడు. తేలికపాటి క్లినికల్ లక్షణాలను మాత్రమే కలిగి ఉన్నాడు.
కాగా ఈ కొత్త వేరియంట్ లపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య అధికారులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇది ఒమిక్రాన్ వేరియంట్ కు చెందినది చెప్పారు. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే దేశమంతటా గతేడాది విస్తరించింది. కాబట్టి ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపలేదు. ఇది డెల్టా వెర్షన్ వైరస్ కంటే తక్కువ తీవ్ర ప్రభావాన్ని కలిగి ఉందని అధికారులు తెలిపారు.
కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 2685 కొత్త కరోనా వైరస్ కేసులను అధికారులు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,31,50,215 కు పెరిగింది. అదే సమయంలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 16,308కి చేరింది. గత 24 గంటల్లో, దేశంలో ఇన్‌ఫెక్షన్ కారణంగా మరో 33 మంది రోగులు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 5,24,572 కు చేరుకుంది.
రాష్ట్రాల అభివృద్ధి లేకుండా దేశం ఎప్పటికీ పురోగమించదు - ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ప్రస్తుతం దేశంలో 16,308 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా పేర్కొంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.04 శాతం ఉండగా.. జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.75 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రచారం కింద ఇప్పటివరకు 193.13 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు దేశ ప్రజలకు అందించారు.