corona virus : కోవిడ్ ఫోర్త్ వేవ్.. మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్ని న‌మోదు అయ్యాయంటే ?

దేశంలో కోవిడ్ -19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 19 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. 45 మంది  కరోనాతో మరణించారు. 

Covid fourth wave.. Corona cases are increasing again.. How many newly registered?

కొంత కాలం కింద‌ట వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టిన కరోనా కేసులు.. ఇటీవ‌ల మ‌ళ్లీ పెరుగుతున్నా. ప్ర‌పంచంలోని అనేక దేశాల్లో ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కాగా ఇండియాలో కూడా కేసులు పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో భార‌త్ లో కొత్త  19,673 కోవిడ్ -19 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 44,019,811కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం (జూలై 31, 2022) త‌న అధికారిక వెబ్ సైట్ లో పొందుప‌ర్చింది. 

ఈ తాజా స‌మాచారం ప్ర‌కారం..దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,676కి పెరిగింది. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా వ‌ల్ల 45 మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 5,26,357కి చేరుకుంది. యాక్టివ్ కోవిడ్-19 కాసేలోడ్‌లో 24 గంటల వ్యవధిలో 292 కేసులు పెరిగాయి.  కాగా దేశంలో ఒక్కరోజులో 19,336 రికవరీలు కూడా నమోదయ్యాయి. దీంతో వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,33,49,778కి పెరిగింది, కేసు మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది.

WB SSC Scam : అర్పితా ముఖ‌ర్జీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌పై ఈడీ ఫోక‌స్.. వీటి వెన‌క ఉన్న అస‌లు ఉద్దేశం ఏంటి ?

మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.33 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.48 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతం,  వీక్లీ పాజిటివిటీ రేటు 4.88 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఆదివారం ఉదయం 8 గంటల వ‌ర‌కు 204.25 కోట్ల టీకాలు అందించారు. వీటిలో గ‌త 24 గంట‌ల్లోనే 31,36,029 డోస్‌లు అందించారు. 

భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 2020 ఆగ‌స్టు 20వ తేదీన 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలకు చేరుకుంది. సెప్టెంబర్ 16న 50 లక్షలు, సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు దాటింది. అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్‌ను అధిగమించింది. దేశం గత ఏడాది మే 4న రెండు కోట్లు, జూన్ 23న మూడు కోట్ల మైలురాయిని దాటింది. ఈ ఏడాది జనవరి 25న నాలుగు కోట్ల మార్కును అధిగ‌మించింది. 

శివసేన ఎంపీ సంంజయ్ రౌత్ నివాసంలో ఈడీ అధికారుల సోదాలు..

కాగా.. తాజాగా అందుబాటులోకి వ‌చ్చిన స‌మాచారం మేర‌కు క‌రోనా వ‌ల్ల మహారాష్ట్ర అత్య‌ధికంగా ప్ర‌భావితం అయ్యింది. ఈ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 80,45,606 మందికి వ్యాధి సోక‌గా.. 1,48,101 మంది మరణించారు. 67,17,856 కేసుల‌తో కేర‌ళ రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 70,451 మంది రోగులు చ‌నిపోయారు. కర్ణాటకలో 40,05,671 కేసులు, 40,102 మరణాలు, తమిళనాడులో 35,42,779 కేసులు, 38,032 మరణాలు సంభవించాయి. 

అయితే క‌రోనా వ‌ల్ల ప్ర‌భావితం అయిన‌ మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనే ఇప్పుడు అత్య‌ధికంగా కేసులు వెలుగులోకి వ‌స్తున్నాయి. మహారాష్ట్రలో రోజువారీ కేసులలో స్వల్ప తగ్గుదల క‌నిపిస్తుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఈ రాష్ట్రంలో 2,087 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే త‌మిళ‌నాడులో 1,548 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. కేరళలో శనివారం 1,599 కొత్త మందికి కరోనా వైరస్ సోకింది. కర్ణాటకలో 1,886 కొత్త కేసులు నమోదయ్యాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios