Corona virus : వేగంగా పెరుగుతున్న కరోనా.. దేశ వ్యాప్తంగా కొత్తగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే ?
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మొత్తంగా 20,557 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అయితే యాక్టివ్ కేసులు కొంత తగ్గాయి.
భారత్ లో కోవిడ్ -19 కేసులు మరోసారి వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా కొత్తగా కేసుల్లో పెరుగుదల కనిపించింది. కాగా.. చాలా కాలం తర్వాత యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం (29 జూలై 2022) ఉదయం 8 గంటలకు విడుదల చేసిన డేటా ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 20,409 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు (జూలై 28న) రోజు 20,557 కొత్త కేసులు నమోదయ్యాయి. జూలై 27వ తేదీన 18,313 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. జూలై 01న 17,070 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
తోటి విద్యార్థినికి ‘ఐలవ్యూ’ చెప్పి.. న్యూడ్ వీడియో కాల్స్ చేయమని.. బ్లాక్ మెయిల్..
కాగా తాజా కేసులతో యాక్టివ్ కేసులు 1,43,988 కు చేరుకున్నాయి. 24 గంటల్లో మొత్తంగా 32 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 5,26,258కి చేరుకుంది, మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.33 శాతం ఉండగా.. జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.48 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. యాక్టివ్ కోవిడ్-19 కాసేలోడ్‌లో 24 గంటల వ్యవధిలో 2,335 కేసులుగా ఉన్నాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 5.12 శాతం, వారపు పాజిటివిటీ రేటు 4.82 శాతంగా నమోదైంది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,33,09,484కి పెరిగింది. అయితే కేసు మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశవ్యాప్తంగా COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 203.60 కోట్ల డోస్‌ల COVID-19 వ్యాక్సిన్ అందజేశారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Monkeypox : మంకీపాక్స్ వ్యాప్తి లక్షణాలు గతం కంటే భిన్నంగా ఉన్నాయ్.. వెల్లడించిన కొత్త అధ్యయనం
భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 2020 ఆగస్టు 20వ తేదీన 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలకు చేరుకుంది. సెప్టెంబర్ 16న 50 లక్షలు, సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు దాటింది. అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్‌ను అధిగమించింది. దేశం గత ఏడాది మే 4న రెండు కోట్లు, జూన్ 23న మూడు కోట్ల మైలురాయిని దాటింది. ఈ ఏడాది జనవరి 25న నాలుగు కోట్ల మార్కును అధిగమించింది.
కాగా కొత్తగా సంభవించిన కోవిడ్ మరణాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి ఏడుగురు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ముగ్గురు చొప్పున, ఛత్తీస్ ఘడ్, పంజాబ్, ఉత్తరాఖండ్ నుంచి ఇద్దరు చొప్పున, చండీగఢ్, గోవా, గుజరాత్, హర్యానా, జమ్మూకశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 32 మంది ఉన్నారు.
యువతి ప్రాణం తీసిన అనుమానం.. పెళ్లి చేసుకోవాల్సిన ప్రేయసిని హతమార్చిన ప్రియుడు
మహారాష్ట్రలో 8041522 కేసులతో మొదటి స్థానంలో ఉంది. వీరిలో 7879766 మంది కోలుకున్నారు. 6716247 కేసులతో రెండో స్థానంలో కేరళ, 4001655 కేసులతో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు తమిళనాడులో 3539607, ఆంధ్రప్రదేశ్‌లో 2331092, ఉత్తరప్రదేశ్‌లో 2100981, పశ్చిమ బెంగాల్‌లో 2090483, ఢిల్లీలో 1951930, ఒడిశాలో 1310115, రాజస్థాన్‌లో 1293457, గుజరాత్‌లో 1252089 కరోనా కేసులు నమోదయ్యాయి.