ప్రపంచ విపత్తులు: గతంలో ఒలింపిక్స్ ఎప్పుడు, ఎందుకు రద్దయ్యాయంటే...

ఈ ఒలింపిక్ క్రీడలు కరోనా బూచి భయానికి వాయిదా పడితే... గతంలో ఇలా ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు రద్దయ్యాయి, ఎందుకు రద్దయ్యాయి అనే విషయాలను తెలుసుకుందాం. 

World Disasters: Know When and how were Olympics cancelled in the past

ప్రపంచమంతా కరోనా వైరస్ బారినపడి బయటపడలేక కొట్టుమిట్టాడుతుంది. అంతకంతకు పెరుగుతున్న కేసులు, మరణాలతో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఏమి చేయాలో అర్థం కాక తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి.  

ఇక ఈ వైరస్ దెబ్బకు ప్రజలెవ్వరూ గుమికూడకుండా చూడడానికి ప్రపంచదేశాలు ప్రజలపై తీవ్రమైన ఆంక్షలను విధిస్తున్నాయి. ఇందుకోసంగానే ప్రపంచ క్రీడలాన్ని కూడా వాయిదా పడుతున్నాయి. 

తాజాగా ఈ వైరస్ కి టోక్యో ఒలింపిక్స్ కూడా బలయ్యాయి.   కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న వేళ టోక్యో ఒలింపిక్స్‌ను ఏడాది తర్వాత నిర్వహిస్తామని జపాన్‌ ప్రధాని మంగళవారం ప్రకటించాడు. 

Also Read:వినకపోతే 24 గంటల కర్ఫ్యూ, అదీ కాకపోతే కనిపిస్తే కాల్చివేత: కేసీఆర్

124 సంవత్సరాల ఆధునిక ఒలింపిక్‌ క్రీడల చరిత్రలో ఒలింపిక్స్‌ రద్దు అయ్యాయి కానీ, ఏనాడూ ఒలింపిక్స్‌ వాయిదా పడలేదు. తొలిసారి ఆ సన్నివేశం ఆవిష్కతమైంది. జులై 24-9 ఆగస్టు 2020 టోక్యో ఒలింపిక్స్‌ ఏడాది పాటు వాయిదా పడింది. 

2021 వేసవిలో టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. తొలిసారిగా ఈ ఒలింపిక్ క్రీడలు వాయిదా పడడంతో అందరూ కూడా ఈ మహమ్మారి ఇంకెంతకు దారి తీస్తుందో అని ఆవేదన చెందుతున్నారు. 

ఇలా ఈ ఒలింపిక్ క్రీడలు కరోనా బూచి భయానికి వాయిదా పడితే... గతంలో ఇలా ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు రద్దయ్యాయి, ఎందుకు రద్దయ్యాయి అనే విషయాలను తెలుసుకుందాం. 

గతంలో ఎప్పుడంటే... 

గతంలో ఇలా ఒలింపిక్ క్రీడలు రద్దవ్వడానికి కారణం ప్రపంచ యుద్ధాలు. రెండు ప్రపంచ యుద్ధాలు. మూడు ఒలింపిక్స్‌ను మింగేశాయి. 1916, 1940, 1944 ఒలింపిక్‌ క్రీడలు యుద్ధాల వల్ల రద్దయ్యాయి. దేశాల మధ్య జరుగుతున్న అసలు సంగ్రామం... ఈ క్రీడా సంగ్రామాన్ని రద్దయ్యేలా చేసింది. 

అమెరికా, రష్యా ల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోన్న సమయంలో...  1976, 1980, 1984 ఒలింపిక్స్‌ ను బహిష్కరిస్తామనే హెచ్చరికలు జోరుగా వినిపించాయి. కొన్ని దేశాలు వాటిని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి దూరంగా ఉన్నాయి కూడా. 

Also Read:సర్వైవ్ లెన్స్ స్టేట్ గా తెలంగాణ: తాజాగా మరో మూడు కరోనా కేసులు

ఈ మూడు ఒలింపిక్స్‌ను 50కి పైగా దేశాలు బహిష్కరించాయి. అయినా, ఒలింపిక్స్‌ మాత్రం ఆగలేదు. నిర్ణీత సమయానికే జరిగాయి. ఇప్పుడు ప్రపంచంపై యుద్ధ మేఘాలు లేవు. వాణిజ్య వార్‌ నడుస్తున్నప్పటికీ ఒలింపిక్స్ ను ఆపెంత స్థాయిలో లేదు. అయినా, 2020 ఒలింపిక్స్‌ వాయిదాపడింది.  

ఈ  ప్రపంచ క్రీడలపై కరోనా వైరస్‌ దారుణంగా పంజా విసిరింది. కరోనా మహమ్మారి ధాటికి ఈ ప్రతిష్టాత్మక విశ్వ క్రీడా సంగ్రామం సైతం తలొగ్గక తప్పలేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios