Asianet News TeluguAsianet News Telugu

సర్వైవ్ లెన్స్ స్టేట్ గా తెలంగాణ: తాజాగా మరో మూడు కరోనా కేసులు

తెలంగాణను సర్వైవ్ లెన్స్ స్టేట్ గా ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారు. ఏ మాత్రం జ్వరం ఉన్నా కోరనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Telanagana as surveillance state: coronapositive cases 36
Author
Hyderabad, First Published Mar 24, 2020, 2:09 PM IST

హైదరాబాద్: తెలంగాణను సర్వైవ్ లెన్స్ స్టేట్ గా ప్రకటించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కరోనాను కట్టడి చేయడానికి ఏ విధమైన అవకాశాన్ని కూడా వదులుకోకూడదని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో జ్వరం వచ్చిన ప్రతి వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.

దగ్గు, జ్వరం, తుమ్ములు, జలుబు కరోనా లక్షణాలు కాబట్టి ఏ మాత్రం జ్వరం ఉన్నా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 97 మంది అనుమానితులు ఆస్పత్రుల్లో ఉన్నారు.

తాజాగా కరోనా పాజిటివ్ ఉన్న ముగ్గురు కూడా విదేశాల నుంచి వచ్చారు. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఈ ముగ్గురు లండన్, జర్మనీ, సౌదీల నుంచి వచ్చారు. లండన్ నుంచి వచ్చిన హైదరాబాదు వచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఇతను హైదరాబాదులోని కోకాపేటకు చెందినవాడు.

జర్మనీ నుంచి వచ్చిన 39 ఏళ్ల వయస్సు గల మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. సౌదీ నుంచి వచ్ిచన 61 ఏళ్ల వయస్సు గల మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరో 9 కరోనా ఆనుమానిత కేసులను కూడా అధికారులు గుర్తించారు. సోమవారంనాడు 33 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా మూడు కేసులు నిర్ధారణ కావడంతో ఆ సంఖ్య 36కు చేరింది

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. పోలీసుల సాయంతో లాక్ డౌన్ సంపూర్ణంగా అమలయ్యే విధంగా చూస్తున్నారు. అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తమై లాక్ డౌన్ అమలుయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios