భర్తకి కరోనా.. లాక్ డౌన్ లో భార్య ప్రేమతో ఏం చేసిందంటే...
హువాంగ్ ప్రతిరోజూ మధ్యాహ్నం రెండు గంటలకు కివి పండ్లను తీసుకొని భర్తను కలుసుకునేందుకు వచ్చేది. అయితే ఫిబ్రవరి 1 నుండి లాక్ డౌన్ అమలయ్యింది. అయితే హువాంగ్ ప్రత్యేక అనుమతితో ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చి కివి పండ్లు, ఒక ప్రేమ లేఖను తీసుకువచ్చి, నర్సుకి ఇచ్చి వెళ్లిపోయేది.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా.. ఈ వైరస్ ని ఎదురుకోవడానికి చాలా దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. కాగా.. తాజాగా ఈ కరోనా వలయంలో ప్రేమ కథ బయటపడింది.
భర్త కరోనా సోకి ఆస్పత్రిలో ఉంటే.. భార్య లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉండిపోయింది. అయినప్పటికీ.. ఆమె తన భర్త కోసం పరితపించిపోయింది. తన ప్రేమనంతటనీ లేఖల ద్వారా తెలియజేసింది. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చైనాలోని హాంగ్‌జౌ నగరంలో 84 ఏళ్ల హువాంగ్ గువోకి నివసిస్తోంది . ఆమె భర్త సన్ శ్వాసకోశ సమస్యలతో ఏడాది కాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హువాంగ్ తన భర్తను కలవడానికి ప్రతిరోజూ ఆసుపత్రికి వెళ్ళేది. ఆసుపత్రి సిబ్బంది ఈ జంటను 'దాది హువాంగ్' 'దాదా సన్' అని పిలిచేవారు.
Also Read పాక్ లో కరోనా విజృంభణ..17మంది మృతి...
హువాంగ్ ప్రతిరోజూ మధ్యాహ్నం రెండు గంటలకు కివి పండ్లను తీసుకొని భర్తను కలుసుకునేందుకు వచ్చేది. అయితే ఫిబ్రవరి 1 నుండి లాక్ డౌన్ అమలయ్యింది. అయితే హువాంగ్ ప్రత్యేక అనుమతితో ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చి కివి పండ్లు, ఒక ప్రేమ లేఖను తీసుకువచ్చి, నర్సుకి ఇచ్చి వెళ్లిపోయేది.
ఆ లేఖలలో ఆమె భర్తకు ధైర్యాన్ని నూరిపోసేది. మీరు ధైర్యంగా ఉండండి పిల్లలు, మనవరాళ్లు అందరూ బాగున్నారు. నర్సులు, వైద్యులు చెప్పినట్లు నడుచుకోండి. నేను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను. అని రాసేది.
ఇలా భర్తకు మొత్తం 45 ప్రేమ లేఖలు రాసింది. సన్ తన భార్య రాసిన ప్రేమలేఖలను చదువుతుండేవాడు. తాజాగా లాక్ డౌన్ ఎత్తివేశాక హువాంగ్ ఆసుపత్రికి వచ్చి భర్తను కలుసుకుంది. ఒకరిని ఒకరు చూసుకుని ఆనందంగా కివి పండ్లు తిన్నారు.