Asianet News TeluguAsianet News Telugu

పాక్ లో కరోనా విజృంభణ..17మంది మృతి

ఇప్పటి వరకు పాకిస్థాన్ లో 1600మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. కాగా.. ఇప్పటి వరకు 17మంది  ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాది దేశాలతో పోలిస్తే.. పాక్ లోనే ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం.
 

Pakistan records 1600 coronavirus positive cases, 17 deaths
Author
Hyderabad, First Published Mar 30, 2020, 3:45 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ భారిన పడి వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బ్రిటన్, స్పెయిన్, ఐరోపా, అమెరికాలతోపాటు పాకిస్థాన్ లో కూడా ఈ వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో భాగంగా ప్రపంచ దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. అయినప్పటికీ మరణాలు పెరుగుతూనే ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు పాకిస్థాన్ లో 1600మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. కాగా.. ఇప్పటి వరకు 17మంది  ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాది దేశాలతో పోలిస్తే.. పాక్ లోనే ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం.

ఇదిలా ఉండగా..భారతదేశము లో ఇప్పటివరకు కరోనా వైరస్ కేసులు సంఖ్య 1,024 కు పెరిగింది. అయితే ఈ వైరస్ ద్వారా మరణించిన వారి సంఖ్య 27 కి చేరింది. 

అయితే ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన రోగుల సంఖ్య 85. అయితే ఇంకా 901 మంది వైద్యుల పర్యవేక్షణ లో చికిత్స పొందుతున్నారు.

Also Read బ్రేకింగ్: కరోనా ఒత్తిడిని తట్టుకోలేక ఆర్ధికమంత్రి ఆత్మహత్య...

ఈ కరోనా వైరస్ కేసులు అత్యధికంగా మహారాష్ట్ర లో ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య 200 కి చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 22 నమోదు అయ్యాయి. అయితే కేరళలో సైతం కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి అక్కడ ఈ రోజు కొత్తగా 20 మందికి పాజిటివ్ వచ్చింది.

అక్కడ ఇప్పటివరకు 181 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

కర్ణాటక లో 76, తెలంగాణ లో 70, ఆంధ్ర ప్రదేశ్ లో 21 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జమ్మూకశ్మీర్‌లో 18, పశ్చిమబెంగాల్‌లో 15, ఆంధ్రప్రదేశ్‌లో 16, లదాఖ్‌లో 13, బిహార్‌లో 9, చండీగఢ్‌లో 7, ఛత్తీస్‌గఢ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో 5, హిమాచల్‌ ప్రదేశ్‌లో 3, ఒడిశాలో 3, గోవాలో 3, పుదుచ్చేరిలో ఒకటి, మిజోరాంలో ఒకటి, మణిపూర్‌లో ఒకటి, అండమాన్‌ దీవుల్లో 2 కేసులు నమోదయ్యాయి.

అయితే ప్రపంచ దేశాలు సైతం ఈ వైరస్ భారిన పడి ఆందోళనా చెందుతున్నాయి. ఇప్పటివరకు 6,63,740 కేసులు నమోదు కాగా 30,879 మంది ఈ కరోనా వైరస్ కారణంగా మరణించారు.

Follow Us:
Download App:
  • android
  • ios