కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.  ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 15వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 3లక్షల మందికి ఈ వైరస్ సోకింది. అయితే... కరోనా వైరస్ కారణంగా ఎక్కువ మంది వృద్ధులే చనిపోతున్నారని.. లేదా ఇతర అనారోగ్యాలు ఉన్నవారే దీని బారిన పడుతున్నారనే ప్రచారం ఇటీవల జరిగింది. అయితే.. ఈ వైరస్ ఎలాంటివారికైనా సోకే అవకాశం ఉందని తాజాగా నిర్ధారణ అయ్యింది.

Alos Read కరోనాపై ఇటలీ చేతులెత్తేసిన వేళ... సొల్యూషన్ చెప్పిన ఇజ్రాయెల్...

కరోనా వైరస్ బారిన పడి 21 ఏళ్ల యువతి మరణించింది. ఆమెకు అంతకు ముందు ఎటువంటి  అనారోగ్యం లేదు. ఇలా అనారోగ్యం లేకుండా కరోనా బారినపడి మరణించిన అతి పిన్న వయస్కురాలు ఈమెనే అని గుర్తించారు. యుకెలోని బకింగ్‌హామ్‌షైర్‌లో నివసిస్తున్న చలోయి మిడిల్టన్ తల్లి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఇది వైరల్ అయ్యింది. 

దేశవ్యాప్తంగా ప్రజలు చలోయికి నివాళులు అర్పించారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఈ ఉదంతం  ట్రెండింగ్ లో ఉంది. చలోయి కుటుంబ సభ్యులు ఆమెకు గతంలో ఎటువంటి అనారోగ్యం  లేదని చెప్పారు. అందుకే ఈ ప్రాణాంతక వైరస్ ను  తేలికగా తీసుకోవద్దని, ప్రజలంతా ఇంట్లోనే వుండాలని విజ్ఞప్తి చేశారు. కాగా ప్రపంచవ్యాప్తంగా, కరోనా వైరస్ సోకిన వారి కేసులు  చాలా వేగంగా పెరుగుతున్నాయి.