కరోనాపై ఇటలీ చేతులెత్తేసిన వేళ... సొల్యూషన్ చెప్పిన ఇజ్రాయెల్
ఇలా ఇంటిపెద్దలను కోల్పోతుండడంతో ఇటలీ వాసులు తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి నఫ్తాలి బెన్నెట్ మంచి సలహా ఇచ్చారు. ఆ సలహాను పాటించి తమ ఇంటి పెద్ద దిక్కులను కాపాడుకోవాలని సూచిస్తున్నాడు.
ప్రపంచమంతా కరోనా వైరస్ బారినపడి బయటపడలేక కొట్టుమిట్టాడుతుంది. అంతకంతకు పెరుగుతున్న కేసులు, మరణాలతో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఏమి చేయాలో అర్థం కాక తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి.
భారతదేశంలో కూడా ఈ కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంది. చాలా రాష్ట్రాలు ఇప్పటికే షట్ డౌన్ ప్రకటించాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా షట్ డౌన్ ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నాయి. షట్ డౌన్ కూడా పనిచేయడం లేదు అని భావిస్తే ఏకంగా కర్ఫ్యూ విధిస్తున్నారు. తెలంగాణాలో ఇప్పటికే రాత్రి 7 గంటల నుండి తెల్లవారుఝామున 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంది.
మరోపక్క ఇటలీ దేశమేమో సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవడం వల్ల అక్కడ ఆ మహమ్మారి దెబ్బకు రోజుకు వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత మెరుగైన వైద్య సేవలున్న అతి కొద్దీ దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. అయినప్పటికీ ఇటలీ జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమై ఇప్పుడు అగమ్యగోచరం పరిస్థితుల్లో ఆసుపత్రులు సరిపోక తల్లడిల్లుతోంది.
Also Read:కరోనా డేంజర్ బెల్స్.. దేశం మొత్తం 21 రోజుల పాటు లాక్‌డౌన్ : మోడీ
అమెరికా పరిస్థితి కూడా అచ్చం ఇలానే ఉంది. అమెరికాలో కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోక సరైన సమయానికి టెస్టులు చేయక అక్కడ చాలావరకు ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు.
ఇక ఈ వైరస్ బారిన పది మరణిస్తున్నవారిలో అత్యధికులు ముసలివారే. వారి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వారు త్వరగా ఈ వైరస్ బారిన పది మరణిస్తున్నారు. ఇటలీలోనయితే ముసలివారికి అసలు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. అక్కడ వైరస్ విలయ తాండవం చేస్తుండడంతో అక్కడ ఆసుపత్రులు సరిపోవడం లేదు.
వయసులో ఉన్న వారిని రక్షించుకోవడానికి వారు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో ముసలివారికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ప్రపంచంలోనే అత్యున్నతమైన వైద్యం అందించే ఇటలీ ఈ స్థాయికి చేరుకోవడంతో ప్రపంచం,అంతా ఈ మహమ్మారిని చూసి వణికిపోతుంది.
Also Read:దేశంలో కరోనా కేసుల సంఖ్య 566: రాష్ట్రాల వారీగా తాజా లెక్కలు ఇవీ...
ఇకపోతే... ఇలా ఇంటిపెద్దలను కోల్పోతుండడంతో ఇటలీ వాసులు తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి నఫ్తాలి బెన్నెట్ మంచి సలహా ఇచ్చారు. ఆ సలహాను పాటించి తమ ఇంటి పెద్ద దిక్కులను కాపాడుకోవాలని సూచిస్తున్నాడు.
షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉండడం, చేతులను కడుక్కోవడం, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలన్నీ కంటే ముఖ్యంగా వృద్ధులకు యువత దూరంగా ఉండాలని ఆయన తెలిపారు.
ప్రపంచంలో లెక్కలను గనుక పరిశీలిస్తే... కరోనా వైరస్ సోకిన వారిలో 70, 80లలో ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరు చనిపోతున్నారు. 20-30లలో ఉన్నవారి మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నాడు.
వృద్ధులకు యువతీ, యువకులు దూరంగా ఉండటం వల్ల వారి ప్రాణాలను రక్షించినవారవుతారని ఆయన తెలిపారు. అమ్మమ్మ, తాతయ్యలు, నానమ్మ, తాతయ్యల దగ్గరకు వెళ్లినప్పుడు ప్రేమతో వారిని హగ్ చేసుకోవడం వంటి విషయానికి దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆహారం ఇచ్చినప్పుడు కూడా దూరంగా ఉండి ఇవ్వాలని, వీలైనంత వరకు ఇంట్లోకి వెళ్లకుండా.. దాదాపు మూడు మీటర్ల దూరాన్ని పాటించాలని ఆయన అన్నారు.కరోనా ప్రభావం తగ్గేంతవరకు ఇలా చేస్తే మన పెద్దవారిని రక్షించుకోవచ్చని ఆయన తెలిపారు.