చిన్న టెక్నిక్.. నేను కరోనా నుంచి ఇలా కోలుకున్నా: హ్యారీ పోటర్ రచయిత
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓ డాక్టర్ చెప్పిన చిన్న సూచనలతో తాను రెండు వారాలుగా కరోనా లక్షణాలతో పడుతున్న బాధ నుంచి కోలుకున్నానని చెప్పారు ‘హ్యారీ పోటర్’’ రచయిత జేకే రోలింగ్.a
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓ డాక్టర్ చెప్పిన చిన్న సూచనలతో తాను రెండు వారాలుగా కరోనా లక్షణాలతో పడుతున్న బాధ నుంచి కోలుకున్నానని చెప్పారు ‘హ్యారీ పోటర్’’ రచయిత జేకే రోలింగ్.
Also Read:48గంటల్లో కరోనాని చంపే మందు.. దొరికేసిందా...?
తన భర్త డాక్టర్ నీల్ ముర్రే సూచన మేరకు డాక్టర్ సర్ఫరాజ్ మున్సీ సూచనలను పాటించానని, ప్రజల సౌకర్యార్ధం ఆయన వీడియో పోస్ట్ చేశారు రోలింగ్. దగ్గు, జ్వరం, ఊపిరి తీసుకోవడం వంటి కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ రోలింగ్ కరోనా టెస్టులు చేయించుకోకపోవడం గమనార్హం. తగ్గిపోయింది కనుక ఇక అవసరం లేదని ఆమె తెలిపారు.
డాక్టర్ సర్ఫరాజ్ మున్సీ సూచనలు:
* ఊపిరితిత్తుల్లోకి లోతుగా గాలిని పీల్చుకోవాలి.
* 50 సెకన్ల పాటు ఊపిరి బిగపెట్టి మెల్లగా గాలిని బయటకు వదలాలి, ఇలా ఐదు సార్లు చేయాలి.
* ఆరోసారి గాలిని బయటకు వదులుతూ మూతికి అడ్డంగా ఏదైనా పెట్టుకొని గట్టిగా దగ్గాలి.
* దీని వల్ల ఊపిరితిత్తుల్లో శ్లేష్మం ఉన్నట్లయితే అది బయటకు వస్తుంది, ఇలా రెండు సార్లు చేయాలి.
* ఆ తర్వాత పరపుపై దిండు వైపు ముఖం చేసుకుని బోర్లా పడుకుని పదిసార్లు దీర్ఘశ్వాస తీసుకుని వదిలి వేయాలి
* ఊపిరితిత్తులు మన ముందు వైపు ఛాతికి దగ్గరగా ఉండవు, వీపు వైపే దగ్గరగా ఉంటాయి.
* సహజంగా వీపు వైపు పడుకుని ఉంటాం కనుక ఊపిరితిత్తుల్లోకి గాలి వచ్చే ద్వారాలు మూసుకుపోతాయి. అందువల్ల బోర్లా పడుకుని దీర్ఘ శ్వాస తీసుకోవాలి
Also Read:ట్రంప్ బెదిరింపులు... వెనక్కి తగ్గిన భారత్
దీనిని కరోనా వైరస్ సోకిన వారే కాకుండా, సోకని వారు కూడా ముందు జాగ్రత్తగా చేయటం మంచిదని లండన్ రోమ్‌ఫోర్డ్‌లోని క్వీన్స్ ఆసుపత్రి డాక్టర్ సర్ఫరాజ్ మున్సీ సూచించారు. శ్వాస పీల్చుకునే వ్యాయామం ద్వారా కరోనా బారి నుంచి తప్పించుకోవచ్చునని పలువురు యోగా గురువులు ఇప్పటికే సూచించిన విషయం తెలిసిందే.