బ్రేకింగ్: కరోనా ఒత్తిడిని తట్టుకోలేక ఆర్ధికమంత్రి ఆత్మహత్య

లాక్ డౌన్ కొనసాగుతుండడంతో... ఆర్థికపరిస్థితి ఏమిటనే బాధతో ఒత్తిడిని తట్టుకోలేక జర్మనీలోని హెస్సే రాష్ట్ర ఆర్ధిక మంత్రి థామస్ షేఫర్  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

Coronavirus Crisis Worries: Finance minister of hesse state commits suicide

కరోనా దెబ్బకు ప్రపంచమంతా బెంబేలెత్తిపోతోంది. ఈ మహమ్మారికి మందు లేక ప్రపంచ దేశాలన్నీ తమకు తోచిన విధంగా చికిత్సనందిస్తూ... మందు లేదు గనుక ఈ వైరస్ బారినపడకుండా తమ దేశ ప్రజలను చూసుకోవడమే ఏకైకా మార్గంగా ముందుకు వెళుతున్నాయి. 

ఇలా ఈ వైరస్ బారిన పడకుండా, వైరస్ సోకినవాళ్లను ఎవరితో కలవనీయకుండా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ని ఆపాలని అన్ని దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్ కూడా అందుకోసమే లాక్ డౌన్ విధించింది. 

యూరప్ లో పరిస్థితి మరి దయనీయంగా ఉంది. జర్మనీలో 50 వేల కేసులు దాటాయి. ఈ కరోనా ను ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ ప్రకటించడంతో మార్కెట్లు, పరిశ్రమలు అన్ని మూతపడ్డాయి. ఒక రకంగా ఆర్థికవ్యవస్థ పూర్తిగా పడకేసిందని చెప్పవచ్చు. 

Also Read:కరోనా వైరస్ పోలిన హెల్మెట్‌: చెన్నై పోలీసుల వినూత్న ప్రయోగం

పోనీ ఇప్పటికిప్పుడు ఎమన్నా లాక్ డౌన్ ఎత్తేస్తారా అంటే... అది కూడా కనబడడం లేదు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ లాక్ డౌన్ మరింతకాలం కొనసాగేలా కనబడుతుంది. ఇలా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో... ఆర్థికపరిస్థితి ఏమిటనే బాధతో ఒత్తిడిని తట్టుకోలేక జర్మనీలోని హెస్సే రాష్ట్ర ఆర్ధిక మంత్రి థామస్ షేఫర్  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఇలా ఆర్థికంగా దేశం పరిస్థితి, రాష్ట్రంలో ఆర్ధిక ప్రగతిని మరలా ఎలా పట్టాలెక్కియ్యలో అర్థంకాక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన శవమై రైలుపట్టాలా వద్ద కనబడ్డాడు. 

జర్మనీ దేశంలో హెస్సే రాష్ట్రంలోనే ప్రపంచ ప్రఖ్యాత ఫ్రాంక్ ఫర్ట్ నగరం కూడా ఉంది. పూర్తి యూరప్ ఖండానికే ఈ నగరం ఆర్ధిక రాజధానిగా వెలుగొందుతోంది. అలాంటి రాష్ట్రం ఇప్పుడు ఇలా లాక్ డౌన్ లో  ఉండడం,పూర్వపు వైభవం తీసుకురాగలుగుతామా లేదా అని విచారంతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. 

ఇకపోతే పక్కనున్న బ్రిటన్ లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ ప్రిన్స్ చార్లెస్ కి, రాణి ఎలిజబెత్ తో సహా దేశ ప్రధాన మంత్రికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో అక్కడ కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉంది. ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

తాజాగా బ్రిటన్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జెన్నీ హర్రీస్ ఈ కరోనా వైరస్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడిప్పుడే ఇలా లాక్ డౌన్ చేయడం వల్ల కొన్ని సత్ఫలితాలను చూస్తున్నామని, ఇలానే గనుక లాక్ డౌన్ ను కొనసాగిస్తే మరిన్ని ఫలితాలను సాధించే ఆస్కారముందని, అందుకోసమే ఈ లాక్ డౌన్ ని మరో 6 నెలల పాటు పొడిగించేందుకు ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. 

ప్రస్తుతానికి సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తూ... గుంపులుగా బయటకు రావడం అన్ని నిషేధించడం వల్ల చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయని ఆమె అన్నారు. ఇలా ఇప్పుడిప్పుడే కరోనాను కట్టడి చేయగలుగుతున్న వేళ ఇలా గనుక లాక్ డౌన్ ను ఎత్తివేస్తే... ఒక్కసారిగా పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆమె అన్నారు. 

ఇప్పుడు దేశం చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని, ఈ సమయంలోనే ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు. 

ఇకపోతే... అగ్రరాజ్యం అమెరికాలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే చైనా, ఇటలీ దేశాలను దాటేసిన సంగతి తెలిసిందే. కాగా... తాజాగా.. అమెరికాలో మొత్తం లక్షకు పైగా కరోనా కేసులు నమోదైనట్లు గుర్తించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios