ఐపీఎల్ కు కరోనా దెబ్బ: గతంలో క్రికెట్ కు తగిలిన షాకులు ఇవే...
కరోనా వైరస్ కారణంగా క్రికెట్ మ్యాచుల రద్దు చూస్తున్నాం. కానీ గతంలోనూ రెండు పర్యాయాలు క్రికెట్‌కు ఇదే స్థాయిలో అంతరాయం ఏర్పడింది.
ప్రపంచాన్ని కరోనా భయం పట్టి పీడిస్తోంది. జనాలు ఆ పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నారు. ప్రపంచ దేశాలు కూడా ఈ వైరస్ ని ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక, మందు లేక భగవంతుడిపైన్నే భారం వేసి సాధ్యమైనన్ని నివారణా చర్యలను తీసుకుంటున్నారు.
ఇక ఈ వైరస్ ఇప్పుడు ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో సంబంధించినదిలా కాకుండా ప్రపంచాన్ని వణికిస్తోంది. పేద, ధనిక అన్న తేడా లేకుండా అందరిని, అన్ని దేశాలను వణికిస్తోంది. దేశాల మంత్రులు అధ్యక్షుల భార్యలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారంటే... ఈ వైరస్ ప్రభావం ఎంతటిదో మనకు అర్థమవుతుంది.
ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు ఈ కరోనా వైరస్ పాకినట్టు సమాచారం అందుతుంది. ధృవీకృత సమాచారం ప్రకారం దాదాపు 190 దేశాల్లో ఈ వైరస్ తన పంజాను విసరడం ఆరంభించింది. అన్ని దేశాలు తమకు సాధ్యమైన రీతిలో కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నాయి.
తాజాగా టోక్యో ఒలింపిక్స్ కూడా వాయిదా పడింది. కరోనా వైరస్‌కు బలై అత్యధిక మూల్యం చెల్లిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పరిస్థితి సైతం ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేం.
తొలుత ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ ఆడించాలనే ఆలోచన వచ్చినా.. ఆర్థికాంశాలు తెరపైకి రావటంతో ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. అప్పుడు యుద్ధ భీతి మెగా క్రికెట్ మ్యాచులను రద్దు, వాయిదా వేయటం అత్యంత అరుదైన విషయం.
Also Read:వినకపోతే 24 గంటల కర్ఫ్యూ, అదీ కాకపోతే కనిపిస్తే కాల్చివేత: కేసీఆర్
కరోనా వైరస్ కారణంగా క్రికెట్ మ్యాచుల రద్దు చూస్తున్నాం. కానీ గతంలోనూ రెండు పర్యాయాలు క్రికెట్‌కు ఇదే స్థాయిలో అంతరాయం ఏర్పడింది.
ఆ రెండు సందర్భాలు చీకటి రోజుల్లో చోటుచేసుకున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో క్రికెట్ మ్యాచులకు ఈ స్థాయిలో అంతరాయం ఏర్పడింది. 1914 ఆరంభంలో మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా క్రికెట్ మ్యాచులను రద్దు చేశారు. తిరిగి 1920 ఆఖర్లో క్రికెట్ మ్యాచులు ఆడటం మొదలైంది.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ విరామ సమయం కాస్త ఎక్కువ. 1939 ఆగస్టు నుంచి 1946 మార్చి వరకు క్రికెట్ మ్యాచులు జరుగలేదు. ఈ రెండు ప్రపంచ యుద్ధ కాలాల్లో క్రికెట్‌లో ప్రధానంగా రెండు ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీలు నష్టపోయాయి. ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్, ఆస్ట్రేలియాలో షెఫల్ట్ షీల్డ్ ట్రోఫీ.
ఈ రెండు ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులు యుద్ధాల కారణంగా రద్దు చేయబడ్డాయి. యుద్ధ సమయంలోనూ, స్నేహపూర్వక వాతావరణం కొరవడిన తరుణంలోనూ కొన్ని మ్యాచులు జరిగాయి.
1944 లార్డ్స్‌లో ఇంగ్లాండ్ కౌంటీ క్లబ్ మిడిలెక్స్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ జాక్ రాబర్ట్‌సన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో వైమానిక దాడుల సైరన్ మోగింది. మైదానంలో అందరూ నేలపై పడుకున్నారు.
జర్మనీ బాంబు దాడుల సైరన్ ముగిసిన తర్వాత లార్డ్స్ మ్యాచ్ యథాలాపంగా జరిగింది. జాక్ రాబర్ట్‌సన్ సహజ రీతిలో తర్వాతి బంతినే సిక్సర్‌గా బౌండరీ లైన్ దాటించాడు.
Also Read:సర్వైవ్ లెన్స్ స్టేట్ గా తెలంగాణ: తాజాగా మరో మూడు కరోనా కేసులు
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు తొలి వన్డేను ప్రేక్షకులు లేకుండా, ఖాళీ స్టేడియంలో ఆడారు. ఈ మ్యాచ్‌లో అర్థ సెంచరీ చేసిన డెవిడ్ వార్నర్ ప్రేక్షకులు లేకపోవటంతో ఎటువంటి సంబరాలు చేసుకోలేదు. ఇటీవల కాలంలో ప్రేక్షకుల మద్దతు లేకుండా ఓ క్రికెట్ మ్యాచ్‌ను చూడటం ఇదే ప్రథమం.
క్రికెట్ మ్యాచ్‌ను రక్తి కట్టించేందుకు స్టేడియం నిండా అభిమానులే ఉండనక్కర్లేదు, ఇరు జట్లను రసవత్తర సమరంలో ముంచేయగల పోటీతత్వం ఉంటే చాలు అనే వారు లేకపోలేదు. ఇప్పుడు కరోనా పంజా 2019 ఆఖర్లో మొదలైన కరోనా వైరస్ 2020 ప్రథమార్థంలో పంజా విసరటం మొదలెట్టింది.