Asianet News TeluguAsianet News Telugu

లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘించిన మంత్రి: ఏకేసిన జనం, రాజీనామా

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్ నిబంధలను సమర్ధవంతంగా అమలు చేయాల్సిన మంత్రే నిబంధనలను ఉల్లంఘించారు. ఈ విషయమై తీవ్ర విమర్శలు చెలరేగడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. ఈ ఘటన న్యూజిలాండ్ లో చోటు చేసుకొంది.

Coronavirus: NZ health minister breaks lockdown at beach
Author
New Zealand, First Published Apr 7, 2020, 1:33 PM IST

వెల్లింగ్టన్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్ నిబంధలను సమర్ధవంతంగా అమలు చేయాల్సిన మంత్రే నిబంధనలను ఉల్లంఘించారు. ఈ విషయమై తీవ్ర విమర్శలు చెలరేగడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. ఈ ఘటన న్యూజిలాండ్ లో చోటు చేసుకొంది.

న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ మంత్రి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి కుటుంబంతో బీచ్ లో షికారుకు వెళ్లారు.న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ మంత్రి డేవిడ్ క్లార్క్ తన కుటుంబ సభ్యులతో సరదాగా బీచ్ లో షికారుకు వెళ్లాడు. ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో ప్రజలు మంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు.

లాక్‌డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా  అమలు చేయాల్సిన మంత్రి ఆ నిబంధనలను ఉల్లంఘించారు.  దీంతో మంత్రి  ఈ విషయమై  ప్రజలకు వివరణకు ఇచ్చారు. ప్రజలంతా త్యాగాలకు సిద్దంగా ఉండాలని ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ నిబంధనలను మాత్రం తానే ఉల్లంఘించడంతో ప్రజలకు ఇబ్బంది నెలకొందని మంత్రి ఒప్పుకొన్నారు. 

also read:యూకేలో భారతీయ విద్యార్థి మృతి: మృతదేహాం కోసం తల్లిదండ్రుల వినతి

తానొక ఇడియట్ ని ప్రజలకు నా మీద కోపం రావడం సరైందేనని ఆయన అభిప్రాయపడ్డారు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా సమర్పించారు.లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి మంత్రి చాలా పొరపాటు చేశారని ప్రధాని జెసిండా ఆర్డర్న్ అభిప్రాయపడ్డారు. కానీ ప్రస్తుతం అందరం కలిసి కరోనాను కట్టడిని చేయాల్సింది చేయాలని సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios