యూకేలో భారతీయ విద్యార్థి మృతి: మృతదేహాం కోసం తల్లిదండ్రుల వినతి

ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి  అక్కడే మృతి చెందాడు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆంక్షలు నెలకొన్న నేపథ్యంలో తమ కొడుకు మృత దేహాన్ని స్వగ్రామానికి పంపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

UK: Missing Indian student siddarth found dead near river

లండన్: ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి  అక్కడే మృతి చెందాడు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆంక్షలు నెలకొన్న నేపథ్యంలో తమ కొడుకు మృత దేహాన్ని స్వగ్రామానికి పంపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.ఈ విషయంలో భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మహారాష్ట్రలోని పూణెకు చెందిన సిద్దార్ధ్ ముర్కుంబి ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లాడు. యూకేలోని సెంట్రల్ లాంకషైర్ యూనివర్శిటీలో మార్కెట్ కోర్సు చదువుతున్నాడు. 

గత నెల 15వ తేదీ నుండి ఆయన కన్పించకుండా పోయినట్టుగా  తల్లిదండ్రులకు యూకే అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే రిబ్స్‌ల్ నది ఒడ్డున స్థానిక పోలీసులు సిద్దార్ద్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి  పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ఈ సమాచారాన్ని పోలీసులు పూణెలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఇండియాలో ఈ నెల 14వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంది.

యూకేలో ఉన్న సిద్దార్ధ్ మృతదేహాన్ని భారత్ కు రప్పించాలని కుటుంబసభ్యులు భారత ప్రభుత్వాన్ని కోరారు. సిద్దార్ద్  ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతదేహాన్ని రాయల్ ప్రిస్టన్ ఆసుపత్రిలో భద్రపర్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉందని సిద్దార్ద్ కుటుంబసభ్యులు చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో విదేశాలకు వెళ్లే విమానాలను రద్దు చేశారు. దీంతో తమ కొడుకు మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని సిద్దార్ద్ తండ్రి శంకర్ కోరారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios