వచ్చే రెండు వారాలు గడ్డు పరిస్ధితులే: సిద్ధంగా ఉండండి, అమెరికన్లకు ట్రంప్ పిలుపు

కరోనా తీవ్రతను ముందుగా అంచనా వేయడంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విఫలమవ్వడం, నిర్లక్ష్యం అమెరికన్ల పాలిట శాపంగా మారింది. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం అమెరికాలో గడచిని 24 గంటల్లో 856 మంది కరోనా కారణంగా మరణించడంతో మృతుల సంఖ్య 3,896కి చేరింది

coronavirus: every American to be prepared for the har days says Donald Trump

కరోనా తీవ్రతను ముందుగా అంచనా వేయడంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విఫలమవ్వడం, నిర్లక్ష్యం అమెరికన్ల పాలిట శాపంగా మారింది. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం అమెరికాలో గడచిని 24 గంటల్లో 856 మంది కరోనా కారణంగా మరణించడంతో మృతుల సంఖ్య 3,896కి చేరింది.

బాధితుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉంది. ఈ వార్త స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గడుస్తున్న ఒక్కో రోజు ఆ దేశ చరిత్రలో చీకటి దినంగా మిగిలిపోతోంది. 

Also Read:కరోనా సోకి లండన్ లో... 13ఏళ్ల బాలుడు మృతి

మరణాలు, కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. కరోనా మహమ్మారిని ఓ పీడగా అభివర్ణించిన ఆయన రానున్న రెండు వారాలు అత్యంత బాధాకరంగా గడవనున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మరికొన్ని రోజుల్లో మరింత గడ్డు పరిస్ధితులు రానున్నాయని, ఎదుర్కోవడానికి ప్రతి పౌరుడు సిద్ధంగా ఉండాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికిప్పుడు అద్భుతం సృష్టించే మందేమీ లేదని, కేవలం మన వ్యవహారశైలితోనే కరోనాను తరిమికొట్టగలమని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, రానున్న 30 రోజులు అత్యంత కీలకమని ట్రంప్ తెలిపారు. 

మరోవైపు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మంగళవారం సాయంత్రం అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియోతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల్లో కోవిడ్ 19 పరిస్ధితిపై వీరు చర్చించారు. కరోనాపై పోరాడేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని తాము నిర్ణయించామని జయశంకర్ తెలిపారు.

Also Read:హెచ్ఐవీ నివారణకు పోరాడి.. కరోనా వైరస్ సోకి...

మరోవైపు దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితులు నెలకొన్నాయి. ప్రధానంగా హెచ్1బీ వీసాదారుల మెడపై కత్తి వేలాడుతున్న చందంగా మారింది. కరోనా కారణంగా ఇప్పటికే అనేక సంస్థలు భారీ నష్టాల్ని ఎదుర్కొంటున్నాయి.

దీని కారణంగా ఆర్ధికంగా మళ్ళీ నిలదొక్కుకునేందుకు ఆయా సంస్థలు రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగస్తులను తొలగించే అవకాశం ఉందని ఆర్ధికవేత్తల అంచనా. ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత అమెరికాలోనే నివాసం ఉండేందుకు ఉన్న గడువు నిబంధనల్లో  సవరణలు చేయాలని హెచ్1 బీ వీసాదారులు ఫెడరల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios