హెచ్ఐవీ నివారణకు పోరాడి.. కరోనా వైరస్ సోకి...

వారం రోజుల క్రితం ఆమె లండన్ వెళ్లి తిరిగి దక్షిణాఫ్రికా వచ్చారు. కాగా.. లండన్ లో ఉన్న సమయంలోనే ఆమెకు కరోనా వైరస్ సోకింది. అయితే... ఆ లక్షణాలు ఏమీ కనపించకపోవడంతో.. పెద్దగా పట్టించుకోలేదు. సడెన్ గా... అనారోగ్యానికి గురై మంగళవారం ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే మృతి చెందారు.

Indian-Origin Virologist In South Africa Dies Of Coronavirus Complications

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ సోకి ప్రపంచ వ్యాప్తంచ వ్యాప్తంగా 40వేల మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 7లక్షల మందికి పైగా వైరస్ సోకింది.  తాజాగా దక్షిణాఫ్రికాలో భారత సంతతికి చెందిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

దక్షిణాఫ్రికాలో ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా వారిలో ఒకరు భారత సంతతి మహిళ కావడం గమనార్హం. భారత సంతతికి చెందిన గీతా రామ్ జీ (64).. ప్రముఖ వైద్యురాలు. అంతేకాకుండా వ్యాక్సిన్ సైంటిస్ట్, హెచ్ఐవీ ప్రివెన్షన్ రీసెర్చ్ లీడర్ గా కూడా వ్యవహరించారు.

వారం రోజుల క్రితం ఆమె లండన్ వెళ్లి తిరిగి దక్షిణాఫ్రికా వచ్చారు. కాగా.. లండన్ లో ఉన్న సమయంలోనే ఆమెకు కరోనా వైరస్ సోకింది. అయితే... ఆ లక్షణాలు ఏమీ కనపించకపోవడంతో.. పెద్దగా పట్టించుకోలేదు. సడెన్ గా... అనారోగ్యానికి గురై మంగళవారం ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే మృతి చెందారు.

Also Read కరోనా విలయతాండవం.. అంత్యక్రియలపైనా ఆంక్షలు...

పరీక్షల ద్వారా ఆమె కరోనా సోకి చనిపోయినట్లు గుర్తించారు. కాగా.. ఆమె మృతి పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు. కాగా.. 2018 లో, రామ్‌జీకి లిస్బన్‌లో అత్యుత్తమ మహిళా శాస్త్రవేత్త అవార్డు దక్కింది. ఆమెకు ఆ అవార్డ్ యూరోపియన్ డెవలప్‌మెంట్ క్లినికల్ ట్రయల్స్ పార్ట్‌నర్‌షిప్స్ (ఇడిసిటిపి) అందజేసింది.

కొత్త హెచ్‌ఐవి నివారణ పద్ధతులను కనుగొనడంలో ఆమె తన జీవితకాలం నిబద్ధతతో కృషి చేశారు. కాగా.. పురస్కారం అందుకున్న సమయంలో ఆమె మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

"ప్రొఫెసర్ గీతా రాంజీ హెచ్ఐవి నివారణ పరిశోధనా నాయకుడు, హెచ్ఐవి / ఎయిడ్స్ మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచ స్పందనకు ఎంతో కృషి చేస్తూనే ఉన్నారు" అని భారతీయ సంతతి శాస్త్రవేత్త అవార్డు అందుకున్న తరువాత ఎంఎస్ గ్రే చెప్పారు.

ఎంఎస్ రాంజీ భారతీయ సంతతికి చెందిన దక్షిణాఫ్రికా ఫార్మసిస్ట్ ప్రవీణ్ రామ్‌జీని వివాహం చేసుకున్నారు. కాగా... ఆమె అంత్యక్రియల వివరాలు మాత్రం ప్రకటించలేదు.  దక్షిణాఫ్రికాలో అంత్యక్రియలపై నిషేధం విధించారు. కాగా..  గత వారం అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా  21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios