Asianet News TeluguAsianet News Telugu

నేను మాస్క్ పెట్టుకోను, మీరైతే ధరించండి: ట్రంప్ పిలుపు

ఇదే విషయంపై యుఎస్ సర్జన్ జనరల్ జెరోమ్ ఆడమ్స్ మాట్లాడుతూ... వైరస్ సోకినప్పటకీ.. చాలా మందిలో లక్షణాలు కనిపించడం లేదని చెప్పారు. కానీ.. పక్కవారికి మాత్రం పాకుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో సామాజిక దూరం పాటించడం చాలా అవసరమని పేర్కొన్నారు.

"I'm Choosing Not To Do It": Trump As US Urges Citizens To Wear Masks
Author
Hyderabad, First Published Apr 4, 2020, 1:43 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఇప్పటికే ప్రపం వ్యాప్తంగా పది లక్షల మందికి ఈ వైరస్ సోకింది. 50వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ ప్రభావం అమెరికాలో మరింత ఎక్కువగా ఉంది. కేవలం ఒక్క రోజులోనే 1400మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో ఇప్పటి వరకు 7వేలకు పైగా నే ఈ వైరస్ కి బలయ్యారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్.. అమెరికన్లకు పిలుపునిచ్చారు.

Also Read కరోనాతో శవాల గుట్టలేనా: మృతదేహాల కోసం లక్ష సంచులకు అమెరికా ఆర్డర్...

అమెరికన్లు కచ్చితంగా బయటకు వచ్చినప్పుడు మాస్క్ లు ధరించాలని సూచిస్తున్నారు. కిరాణ స్టోర్స్ కి వెళ్లిన సమయంలో కూడా మాస్క్ లు ధరించాలని.. వైరస్ అదుపులోకి వచ్చే వరకు ఈ రూల్స్ పాటించక తప్పదని తన దేశ ప్రజలకు ట్రంప్ వివరించారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన మీడియాతో చెప్పారు. ఈ విషయంపై ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి మరీ ఆయన పేర్కొన్నారు. 

ఇదే విషయంపై యుఎస్ సర్జన్ జనరల్ జెరోమ్ ఆడమ్స్ మాట్లాడుతూ... వైరస్ సోకినప్పటకీ.. చాలా మందిలో లక్షణాలు కనిపించడం లేదని చెప్పారు. కానీ.. పక్కవారికి మాత్రం పాకుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో సామాజిక దూరం పాటించడం చాలా అవసరమని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా..గురువారం నుండి శుక్రవారం ఒక్క రోజులోనే అక్కడ 1500 మరణాలు సంభవించాయి. వీటితో ఇప్పటివరకు అక్కడ సంభవించిన మరణాల సంఖ్య 7,400 కు చేరింది. 

ఈ స్థాయిలో అక్కడ మరణాలు సంభవిస్తున్నప్పటికీ... అక్కడ ఇంకా లాక్ డౌన్ మాత్రం విధించలేదు. న్యూయార్క్ లాంటి నాగరాల్లోనయితే... పరిస్థి మరింత దారుణంగా ఉంది. 

దాదాపుగా న్యూయార్క్ జనాభాలో 60 శాతం మందికి దగ్గర దగ్గరగా కరోనా వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. అమెరికాలో ఇప్పటికిప్పుడు పటిష్టమైన చర్యలను తీసుకోకపోతే అక్కడ మరణ మృదంగాన్ని ఊహించడం ఎవ్వరి తరం కాదు. ఆఫ్హ్యక్ష భవనం వైట్ హౌస్ అంచనాల ప్రకారమే దాదాపుగా రెండున్నర లక్షల మంది మరణించే ఆస్కారముందని తెలిపింది.

ప్రపంచాన్ని కనుసైగతో శాసించే అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవితో పోరాడలేకపపోవడానికి, కారణం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం, ట్రంప్ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు అమెరికన్లు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు.

జాన్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం విశ్లేషణ ప్రకారం... కరోనా కారణంగా సుమారు లక్ష నుంచి రెండున్న ర లక్షల మంది మరణిస్తారని అంచనా.

ఈ నేపథ్యంలో మృతదేహాల కోసం లక్ష సంచులు కావాలని అమెరికా విపత్తు స్పందన సంస్థ ఫెమా ఆ దేశ సైన్యాన్ని కోరిందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. అమెరికా మొత్తం షట్‌డౌన్ కానప్పటికీ.. అక్కడ దాదాపు 85 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios