Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో శవాల గుట్టలేనా: మృతదేహాల కోసం లక్ష సంచులకు అమెరికా ఆర్డర్

ప్రపంచాన్ని కనుసైగతో శాసించే అగ్రరాజ్యం అమెరికా కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవితో పోరాడలేకపోతోంది. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం, ట్రంప్ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు అమెరికన్లు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు

White House task force projects 100,000 to 240,000 deaths in America
Author
New York, First Published Apr 3, 2020, 3:57 PM IST

ప్రపంచాన్ని కనుసైగతో శాసించే అగ్రరాజ్యం అమెరికా కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవితో పోరాడలేకపోతోంది. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం, ట్రంప్ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు అమెరికన్లు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు.

ఇప్పటికే అక్కడ 6 వేల మంది మరణించగా, మూడు లక్షలకు చేరువలో బాధితులు ఉన్నారు. జాన్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం విశ్లేషణ ప్రకారం... కరోనా కారణంగా సుమారు లక్ష నుంచి రెండున్న ర లక్షల మంది మరణిస్తారని అంచనా.

Aslo Read:మరోసారి ట్రంప్ కి కరోనా పరీక్షలు

ఈ నేపథ్యంలో మృతదేహాల కోసం లక్ష సంచులు కావాలని అమెరికా విపత్తు స్పందన సంస్థ ఫెమా ఆ దేశ సైన్యాన్ని కోరిందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. అమెరికా మొత్తం షట్‌డౌన్ కానప్పటికీ.. అక్కడ దాదాపు 85 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.

యునైటెడ్ స్టేట్స్ వాణిజ్య రాజధాని న్యూయార్క్ కరోనాకు కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలు మాస్క్‌లు ధరించకుండా బయటకు రావొద్దని నగర మేయర్ కోరారు.

Also Read:కరోనా నుంచి కోలుకున్న వారి రక్తంతో వైద్యం: వందేళ్ల నాటి విధానంతో అమెరికాలో ప్రయోగం

మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గురువారం రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇందులో నెగిటివ్ వచ్చింది. దేశంలో కరోనా తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో మరో నాలుగు వారాల పాటు ఆంక్షల్ని పొడిగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, సామాజిక దూరం పాటించాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్యులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక సాయంతో అమెరికా కరోనాపై పోరాడుతోందని అధ్యక్షుడు తెలిపారు. వ్యాక్సిన్ తయారీలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని, రోజుకు లక్షమందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios